బీఅలర్ట్‌ : మీరు మొబైల్‌లో డబ్బు ట్రాన్సఫర్‌ చేస్తున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలిసి ఉండాలి

పెరిగిన టెక్నాలజీతో చాలా వరకు పనులు ఈజీగా మారాయి.ఎన్నో కొత్త ఆవిష్కరణల కారణంగా గంటల తరబడి టైం కేటాయించాల్సిన పనులు కూడా నిమిషాల వ్యవధిలో జరిగి పోతున్నాయి.

 Be Alert When Doing Mobile Money Transactions-TeluguStop.com

ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం టెక్నాలజీ వెంట తిరుగుతున్నారు.అద్బుతమైన ఈ టెక్నాలజీని సరిగా వాడుకుంటే పర్వాలేదు, లేదంటే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం.

ఈమద్య కాలంలో ఆన్‌లైన్‌ చెల్లింపులు చాలా ఎక్కువ అయ్యాయి.ప్రతి స్మార్ట్‌ ఫోన్‌లో కూడా ఆన్‌లైన్‌ చెల్లింపుకు సంబంధించిన ఏదో ఒక యాప్‌ ఉంటూనే ఉంటుంది.

అయితే ఈ ఆన్‌లైన్‌ చెల్లింపులతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం అజాగ్రత్తతో ఉన్నా కూడా మొదటికే మోసం వస్తుందనే టాక్‌ ఉంది.

స్మార్ట్‌ ఫోన్‌లో ఇష్టం వచ్చినట్లుగా ఏ యాప్‌లు పడితే ఆ యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దు.

కొన్ని యాప్స్‌ మీ పర్మీషన్‌ తీసుకోకుండానే మీ ఇతర యాప్స్‌ డేటాను చోరీ చేసి, చెడ్డ వ్యక్తులకు చేరవేస్తుంది.అందుకే అలాంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి.

బీఅలర్ట్‌ : మీరు మొబైల్‌లో డబ్

అలాంటి యాప్స్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్‌ చేయదు.అందుకే ఎక్కువ శాతం యాప్స్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ స్టోర్‌లోనే డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి.ఎక్కడ పడితే అక్కడ డౌన్‌లోడ్‌ చేసుకుంటే చెడు ఫలితాలు, అనుభవాలు నమోదు అవుతాయి.

ప్రతి యాప్‌ కూడా మీ ఫోన్‌లోని ఇతర యాప్స్‌తో కనెక్షన్‌ అడుగుతుంది.

అలాంటి సమయంలో చూసి జాగ్రత్తగా ఆలోచించి పర్మీషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

ఉదాహరణకు వాట్సప్‌ ఇన్‌స్టాల్‌ చేసిన తర్వాత అది కాంటాక్ట్స్‌ పర్మీషన్‌ అడుగుతుంది.

అది తప్పనిసరిగా ఇవ్వాలి.అదే వాట్సప్‌ మెసేజ్‌ యాప్‌తో సింక్‌కు పర్మీషన్‌ అడిగింది అంటే నో అని చెప్పాలి.

అలా మనం డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్స్‌ అడిగే పర్మీషన్‌ను బట్టి కూడా అది ఎలాంటిది అని తెలుసుకోవచ్చు.

బీఅలర్ట్‌ : మీరు మొబైల్‌లో డబ్

ఉదాహరణకు ఒక గేమ్‌ యాప్‌ను ఏదైనా డౌన్‌లోడ్‌ చేసుకుంటే అది కాంటాక్ట్స్‌ మరియు మెసేజ్‌లకు సంబంధించిన పర్మీషన్‌, ఇంకా ఇతర బ్యాంక్‌ యాప్స్‌ కు సంబంధించిన పర్మీషన్‌ అడిగింది అంటే వెంటనే దాన్ని తొలగించడం బెటర్‌.

ఇక వచ్చిన ప్రతి మెసేజ్‌కు స్పందించడం, బ్రౌజర్‌లో కొన్ని లింక్‌లు ఓపేన్‌ చేస్తే మన మొబైల్‌ వారి ఆధీనంలోకి వెళ్తుంది.అలాంటి లింక్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మొత్తానికి బ్యాంక్‌ యాప్స్‌ మరియు ఇతర మనీ చెల్లింపుల యాప్స్‌ ఉన్న వారు తమ ఫోన్‌లో పిచ్చి పిచ్చి పనులు చేయకుంటేనే బెటర్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube