వరల్డ్ కప్: రాయుడికి 3D దెబ్బ  

వరల్డ్ కప్: రాయుడికి 3d దెబ్బ-

ఐసిసి వరల్డ్ కప్ లో ఇండియా జట్టుకు ఎంపిక అవుతున్నాను అని ఎంతో ధీమాతో ఉన్న అంబటి రాయుడికి మారోసారి నిరాశ తప్పలేదు.రెండు సార్లు జట్టులోకి వెళ్లే అవకాశం వచ్చినా సెలక్షన్ కమిటీ నిర్ణయానికి రాయుడికి కౌంటర్ పడింది.

వరల్డ్ కప్: రాయుడికి 3d దెబ్బ--Bcci Angry On Ambati Rayudu-

రీసెంట్ గా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయపడటంతో బిసిసిఐ సెలక్షన్ కమిటీ మయాంక్ అగర్వాల్ కి అవకాశం ఇచ్చింది.అసలైతే మొదట్లోనే అంబటి రాయుడిని కాదని సెలక్టర్లు విజయ్ శంకర్ ని ఎంచుకున్నారు.

అందుకు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ కూడా వివరణ కూడా ఇచ్చారు.

విజయ్ శంకర్ ఆల్ రౌండర్ కాబట్టి 3డి డైమెన్షన్ లో వాడుకోవచ్చని సమాధానమివ్వగా.అందుకు రాయుడు, వరల్డ్ కప్ చూసేందుకు 3డి గ్లాసెస్ కొన్నాను అంటూ కౌంటర్ వదిలాడు.ఆ తరువాత బిసిసిఐ ఈ విషయంపై సీరియస్ అయినప్పటికీ స్థానం దక్కలేదనే బాధలో ఉన్నాడని వదిలేశారు.

అయితే ఇప్పుడు విజయ్ శంకర్ గాయం కారణంగా తప్పుకోవడంతో మయాంక్ ని సెలెక్ట్ చేయడం చూస్తుంటే సెలక్టర్లు అతనిపై గుర్రుగా ఉన్నట్లు అర్ధమవుతోంది.మరి భవిష్యత్తులో కూడా రాయుడి విషయంలో సెలక్టర్లు ఇదే తరహాలో వ్యవహరిస్తారో లేదో చూడాలి.