బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఈసారి ఐపీఎల్ అక్కడే..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రతి ఏటా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తుంది.గతేడాది కరోనా కారణంగా ఐపీఎల్ భారతదేశంలో జరగలేదు.

 Bcci Sensational Decision This Time The Ipl Is There Bcci, Key Decision, Ipl, Ip-TeluguStop.com

దీంతో చాలామంది క్రికెట్ ప్రియులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.అయితే తాజాగా బీసీసీఐ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 15వ సీజన్ ను ఈసారి ఇండియాలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.ఐపీఎల్ టోర్నీ మొదటి నుంచీ చివరి వరకూ ముంబై నగరంలోనే నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ముంబైలో ఉన్న వాంఖడే, సీసీఐ (బ్రబోర్న్ స్టేడియం), డీవై పాటిల్ అనే 3 స్టేడియాలలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఇదే జరిగితే ఈ సారి భారతీయ క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా ఐపీఎల్ చూసే అవకాశం లభిస్తుంది.

సాధారణంగా 2022 సీజన్ లో పది జట్టుల కోసం పది రాష్ట్రాల్లో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించాలి.కానీ దేశంలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేవలం మూడు స్టేడియంలలో మాత్రమే మ్యాచులు నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ రచిస్తోంది.

ఏప్రిల్ 2వ తేదీకి బదులుగా మార్చి 15 నుంచి ఐపీఎల్ ప్రారంభించాలని కూడా బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది.

Telugu Bcci, Ipl, Key, Mumbai, Ups-Latest News - Telugu

ఇకపోతే ప్రస్తుతం ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.కరోనా వ్యాప్తి కారణంగా ఈ పనులు కాస్త నత్తనడక నడుస్తున్నాయని తెలుస్తోంది.పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఫిబ్రవరి నెల లోపు మెగా వేలం కూడా పూర్తి చేయాలని ఐపీఎల్ నిర్వాహకులు భావిస్తున్నారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా బీసీసీఐ దేశీయ టోర్నీలతోపాటు రంజీ ట్రోఫీ, ఇతర టోర్నమెంట్ లను వాయిదా వేసింది.గత ఐపీఎల్ సీజన్ ఇండియాలోనే ప్రారంభించినప్పటికీ పరిస్థితులు అనుకూలించక.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మ్యాచులు నిర్వహించాల్సి వచ్చింది.యూఏఈలో సెప్టెంబర్ ద్వితీయార్ధం నుంచి నవంబర్ వరకు ఐపీఎల్ మ్యాచులు కొనసాగిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube