ఐపీఎల్‌ క్రికెటర్లకు కరోనా అందుకే వచ్చిందంటున్న గంగూలీ..!

కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 14 సీజన్ అర్థంతరంగా వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఇంతవరకు సజావుగా సాగుతున్న ఐపీఎల్ లో ఆటగాళ్లకు కరోనా రావడంతో ఒక్కసారిగా పూర్తిగా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 Bcci President Saurav Ganguly Clarification On Corona Infected Ipl Cricketers ,-TeluguStop.com

ఐపీఎల్ యాజమాన్యం కట్టుదిట్టమైన ప్రోటో కాల్స్ అమలు చేసిన గాని.ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో అనేక విమర్శలు తలెత్తాయి.

ఇందులో భాగంగానే బీసీసీఐ అనుసరిస్తున్న బయోబబుల్ లో అనేక లోపాలు ఉన్నాయని, ఐపీఎల్ నిర్వాహకులు చాలా నిర్లక్ష్యంగా నిర్వహించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.అయితే ఈ విషయంపై తాజాగా బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.

ఈ విషయం సంబంధించి గంగూలీ మాట్లాడుతూ ఆటగాళ్లు మొదటి విడత మ్యాచ్ లు అన్ని ముంబై, చెన్నై నగరాల్లో పూర్తిచేసుకొని ఢిల్లీ, అహ్మదాబాద్ లకు ప్రయాణించే సమయంలో కరోనా వచ్చి ఉంటుందని గంగూలీ అభిప్రాయపడుతున్నారు.ఒక బయోబబుల్ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లే సమయంలో బస్సులో, అలాగే విమానాశ్రయాలలో ఆటగాళ్లకు కరోనా బారిన పడి ఉంటారని ఆయన పేర్కొన్నాడు.

అయితే ఇలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే సమయంలో తాము మరికొన్ని జాగ్రత్తలు పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆయన చెప్పుకొచ్చారు.

సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.

ఐపీఎల్ నిర్వహించడం అసలు తప్పు కాదని, అయితే వేదికలు మొత్తం 6 ఉంచడమే తాము చేసిన పొరపాటు అని.

Telugu Bcci, Bio Bubble, Corona Wave, Coronaipl, Covid, Cricket, Ganguly, Ipl, I

కరోనా ఎక్కువగా ఉన్న సమయంలో రెండు నగరాల మధ్య ప్రయాణికులకు అనుమతించడం వల్లే ఆటగాళ్లు కరోనా బారిన పడి ఉంటారని చెప్పుకొచ్చాడు.ఒక్క ప్రయాణాలను మినహాయిస్తే.బయో బబుల్ లో అసలు ఏం జరిగిందన్న విషయం తనకు ఇంకా తెలియాల్సి ఉందని.

దీనిపై పూర్తి విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని గంగూలీ చెప్పుకొచ్చాడు.అయితే ఐపీఎల్ సీజన్ మొదలయ్యే సమయంలో ప్రస్తుతం ఉన్నన్ని కేసుల సంఖ్య అప్పట్లో లేదని ఆయన చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube