క్రికెట్ ప్రేమికులకి సుభవార్త మినీ ఐపీఎల్ ఒస్తోంది

దాదాపు నెలన్నర రోజులుగా అలరించిన ఐపీఎల్ పోటీలు చివరిదశకు వచ్చిన నేపథ్యంలో, క్రికెట్ మజాను కోల్పోతున్నామని బాధపడే వీర ప్రేమికులకు శుభవార్త.సెప్టెంబరులో మినీ ఐపీఎల్ రానుంది.

 Bcci Plans Mini Ipl In September-TeluguStop.com

ఇందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సైతం ఆమోదం పలికే అవకాశాలు ఉన్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది.అయితే, ఈ మినీ ఐపీఎల్ విదేశాల్లో జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.“అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఆర్థికంగా కూడా ఉపకరిస్తుంది.

అమెరికా వంటి దేశాన్ని మ్యాచ్ ల కోసం ఎన్నుకోవాలని భావిస్తున్నాం” అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.సెప్టెంబరులో అంతర్జాతీయ టోర్నీని నిర్వహించే వీలుండటంతో, ఆ దిశగా ఏదైనా టోర్నమెంట్ పెట్టాలని భావిస్తున్న ఐసీసీ, ప్రస్తుత బీసీసీఐ ఆలోచనకు ఎంతమాత్రం సహకరిస్తుందో తెలియాల్సివుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube