సంచలనంగా మారిన బీసీసీఐ అధికారి వ్యాఖ్యలు.. అతడు టీమిండియా టెస్ట్ కెప్టెన్‌‌గా పనికిరాడట..

విరాట్ కోహ్లీ టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది.ఆ స్థానం ఎవరికి అప్పగిస్తారని చర్చ కొనసాగుతోంది.

 Bcci Official Comments On India Test Captain.., Bcci, Cricket, Kl Rahul , Virat Kohli, Sports News , Sports Upadte-TeluguStop.com

కానీ ఈ టైంలో బీసీసీఐ అధికారి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండిగా ఘోరంగా ఫెయిల్ అయింది.

టెస్టు సిరిస్, వన్డే సిరిస్ రెండింటినీ కోల్పోయింది.టెస్టు సిరీస్ తర్వాత టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు.

 BCCI Official Comments On India Test Captain.., BCCI, Cricket, Kl Rahul , Virat Kohli, Sports News , Sports Upadte-సంచలనంగా మారిన బీసీసీఐ అధికారి వ్యాఖ్యలు.. అతడు టీమిండియా టెస్ట్ కెప్టెన్‌‌గా పనికిరాడట..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరో వైపు టీ20, వన్డే ఫర్మట్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.కానీ గాయం కారణంగా అతడు మ్యాచ్ కు దూరం కావడంతో బీసీసీఐ కేఎల్ రాహుల్ కు వన్డే పగ్గాలు అప్పగించింది.

కానీ వన్డే సిరీస్‌లో టీమిండియా దారుణంగా ఓటమి పాలైంది.ఇక టెస్టు కెప్టెన్సీ విషయానికి వస్తే విరాట్ లాంటి డైనమిక్ కెప్టెన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

కొందరైతే రోహిత్ శర్మకే అలాంటి సత్తా ఉందని చెబుతున్నారు.మరో వైపు రాహుల్, బుమ్రా, పంత్ పేర్లు సైతం వినిపిస్తున్నాయి.

టెస్టు కెప్టెన్సీ విషయంలో కేఎల్ రాహుల్ కు ఉన్న అవకాశాల గురించి పీటీఐ ప్రతినిధి బీసీసీఐ అధికారి ని ప్రశ్నించారు.ఇందుకు బీసీసీఐ అధికారి ఇచ్చిన ఆన్సర్ సంచలనంగా మారింది.

కేఎల్ రాహుల్ ఏ కోణంలోనైనా మీకు కెప్టెన్ గా కనిపిస్తున్నాడా అని బీసీసీఐ అధికారి ఎదురు ప్రశ్నించారు.

Telugu Bcci, Cricket, Kl Rahul, Upadte, Virat Kohli-Latest News - Telugu

దీంతో కేఎల్ రాహుల్‌కు టెస్టు కెప్టెన్సీ అవకాశాలు తక్కువనే అనుమానాలు మొదలయ్యాయి.మరి విరాట్ స్థానాన్ని ఎవరికి అప్పగిస్తారు అనే చర్చ ప్రస్తుతం కొనసాగుతోంది.మరి క్రికెట్ అభిమానులు ఎవరిని కెప్టెన్ గా ఇష్టపడుతున్నా.

ఫైనల్ చేయాల్సిన కమిటీ మాత్రం ఇంకా ఈ విషయంపై సస్పెన్స్ ను రివీల్ చేయడం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube