ఐపీఎల్‌ - 2021 కీలక ప్రకటన చేసిన బిసిసిఐ..!

కరోనా వైరస్ కారణంగా 2020 మార్చిలో జరగాల్సిన ఐపీఎల్ సిరీస్ కాస్త నిదానంగా మొదలై 2020 చివర్లో ముగిసింది.అయితే అప్పుడే 2021 సంబంధించి ఐపీఎల్ ఏర్పాట్లు చాలా చురుగ్గా కొనసాగుతున్నాయి.

 Bcci Makes Key Announcement In-ipl 2021ipl 2021, Bcici, Carona Virus, Arun Dhama-TeluguStop.com

ఈ ప్రక్రియలో 8 జట్లు 140 మంది ఆటగాళ్లను అంటిపెట్టుకుంటే 57 మంది ప్లేయర్స్ ను రిలీజ్ చేశాయి సదరు జట్ల యాజమాన్యం.

కరోనా వైరస్ విజృంభణ తరుణంలో ఐపీఎల్ 20 20 యుఏఈ దేశంలో నిర్వహించిన బిసిసిఐ ఈ సంవత్సరం నిర్వహించే ఐపిఎల్ 2021 సీజన్ వేదికపై ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ విషయంపై పూర్తిగా స్పష్టత వచ్చే విధంగా బిసిసిఐ కార్యదర్శి అరుణ్‌ ధుమాల్‌ వివరణ  ఇచ్చారు.ఐపీఎల్ 20 21 సీజన్ ప్రత్యేకత వేదికపై కోసం  ఏ మాత్రం ఆలోచించడం లేదని, భారత్లోనే టోర్నీని నిర్వహించేందుకు ఆత్మవిశ్వాసం గా ఉన్నట్లు ఆయన తెలియజేశారు.

అంతేకాకుండా ఐపిఎల్ లో ఆడే ఆటగాళ్ల అందరికీ కూడా కరోనా వ్యాక్సిన్ ను  అందజేసే విధంగా ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు.ఐపీఎల్ ఎక్కడ జరపాలని దానిపై బోర్డు సభ్యులు చర్చిస్తున్నట్లు అరుణ్ ధుమాల్‌ వివరించారు.

Telugu Arun, Bcici, Carona, Ipl, Ipl Sch, Key-Latest News - Telugu

అలాగే ఐపీఎల్ కాంట్రాక్ట్ లేని ఆటగాళ్లు ఫిబ్రవరి 2 లోగా ఆన్ లైన్ లో వారి పేర్లు నమోదు చేసుకోవాలి.ఆటగాళ్లను రిలీజ్ చేసిన తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఎక్కువ మంది ప్లేయర్స్ ను కలిగి ఉంది.ఇక తమ దగ్గర ఉన్న మొత్తంతో ఐపీఎల్ 2021 మినీ వేలంలో పాల్గొన్నబోతున్నాయి జట్లు.దీంతో స్టార్ ప్లేయర్స్ పై అన్ని ఫ్రాంచైజీల కన్ను పడింది.మార్చి 25 నుంచి ఐపీఎల్ ప్రారంభమయే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ వేలంతో ఇండియాలో క్రికెట్ సన్నహాలు ఊపందుకొనున్నాయి.

Telugu Arun, Bcici, Carona, Ipl, Ipl Sch, Key-Latest News - Telugu

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 2020 ఎడిషన్ సెప్టెంబర్ – నవంబర్‌ లో యుఎఈలో జరిగిన విషయం తెలిసిందే.ఇంగ్లాండ్‌ పర్యటనతో భారత్‌తో చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది.ఇకపోతే ఇప్పుడు ఐపీఎల్ జట్లు వారు రిలీజ్ చేసిన ఆటగాళ్ల వివరాల తర్వాత వారి దగ్గర ఎంత డబ్బు ఉందో ఒకసారి లుక్కేద్దాం.

ఇందులో రాజస్థాన్ రాయల్స్ 34.85 కోట్ల రూపాయలు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ .35.70 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ రూ.22.90 కోట్లు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.53.2 కోట్లు, ముంబై ఇండియన్స్ రూ.15.35 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.12.80 కోట్లుకోల్‌కతా నైట్ రైడర్స్ రూ.10.85 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.10.75 కోట్లు కలిగి ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube