క్రికెట్ చరిత్రలో ఐపిఎల్ కు ప్రత్యేక స్థానం ఉంది.ఐపిఎల్ అంటే అదొక అద్బుత మైన ప్రపంచం.
ఆ టైంలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ టీవీలకు అతుక్కుపోతారు.బెట్టింగ్సు, పోటీలు, ఇలా ఎన్నో చేస్తున్నా ప్రభుత్వాలు మాత్రం ఐపిఎల్ ను ఆపడం లేదు.
ఎందుకంటే ఐపిఎల్ ఒక బంగారు నిధిలాంటిది. బీసీసీఐ ఈ ఐపిఎల్ ను పెట్టడం ద్వారా కొన్ని వేల కోొట్లను మూటగట్టుకుంటుంది.
తాజాగా 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం బీసీసీఐ ముందస్తు ప్రణాళికలను సన్నద్దం చేస్తోంది.వచ్చే సంవత్సరం పది జట్లతో ఐపీఎల్ ను నిర్వహించనుంది.
ఈ తరుణంలో ఈ ఏడాది ఆగస్టు లోనే కొత్తగా టోర్నీలోకి రెండు టీమ్ లు రానున్నాయి.బీసీసీఐ రెండు ఫ్రాంచైజీలను టెండర్లకు పిలవనుంది.
అందులో రెండో జట్టుని ఎవరు కొనుగోలు చేస్తారన్నది తీవ్ర ఉత్కంఠంగా ఉంది.ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రపు జట్టు అయిన గుజరాత్ లోని అహ్మదాబాద్ జట్టుని మన దేశ ధనవంతుల్లో ఒకరైన అదానీ గ్రూప్ టీమ్ ను సొంతం చేసుకోనుంది.ఇకపోతే ఐపీఎల్ జట్టులో అహ్మాదాబాద్ టీమ్ ఒకటి ముందుకు వస్తుందని తెలుస్తోంది.ఆ తర్వాత ఫుణె, లక్నో, కోచి లాంటి నగరాల పేర్లు రెండో జట్టు రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇకపోతే అదానీ గ్రూప్స్ మాత్రం ఐపీఎల్ లో ఎంట్రీ ఇస్తే కనుక ముంబై ఇండియన్స్ ని సొంతం చేసుకున్న అంబానీ గ్రూప్స్ తో బాగా తలపడబోతుంది.వాటి రెండింటికీ మధ్య రసవత్తర పోరు అనేది నెలకొని ఉంది.
డబ్బులని మంచి నీళ్లలా ఖర్చు పెడుతూ ప్రపంచంలోనే బెస్ట్ క్రికెటర్స్ ని పెద్దఎత్తున ముంబై ఇండియన్స్ టీమ్ కొనుగోలు చేస్తుంది.అదానీ గ్రూప్స్ అహ్మదాబాద్ ఫ్రాంచైజ్ ని సొంతం చేసుకుంటే మాత్రం ముంబై ఇండియన్స్ కి గట్టీ పోటీని ఇవ్వనుంది.