టీ20 వరల్డ్ కప్-2022లో భారత్ సెమీస్‌లోనే నిష్క్రమించింది.వరల్డ్ కప్‌లో ఓటమి కంటే మ్యాచ్‌లో ఆటగాళ్లు చేతులెత్తేయడం అభిమానుల ఆగ్రహానికి గురి చేసింది.చివరికి బీసీసీఐ కూడా నష్టనివారణ చర్యలు చేపట్టింది.భారత పురుషుల జట్టు సెలక్షన్ కమిటీని మొత్తం తొలగించింది.వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.అందుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసింది.
ఆసక్తి, అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను నవంబర్ 28, 2022లోపు బీసీసీఐకి సమర్పించాలి.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు సెలక్షన్ ప్యానెల్‌లో చేతన్ శర్మ (ఛైర్మన్), దేబాసిస్ మొహంతి, హర్విందర్ సింగ్, సునీల్ జోషి ఉన్నారు.అబే కురువిల్లా ఈ ఏడాది ఫిబ్రవరిలో సెలెక్టర్‌గా నిష్క్రమించాడు.ఆయన స్థానం ఇంకా భర్తీ కాలేదు.అయితే టీ20 వరల్డ్ కప్ ఓటమితో సమూల మార్పులు చేపట్టింది.సెలెక్టర్ పోస్టులకు దరఖాస్తులను బీసీఐ ఆహ్వానించింది.అందుకు కొన్ని నిబంధనలు నిర్దేశించింది.
సెలెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలి.లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి.
లేకుంటే 10 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.ఇవే కాకుండా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం 5 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.బీసీసీఐ నియమ నిబంధనలను అనుసరించి, మొత్తం 5 సంవత్సరాల పాటు ఏదైనా క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వారు సెలెక్టర్ పోస్టుకు అనర్హులు.2021లో యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.దీంతో ముందుగా సెలెక్టర్లపై వేటు వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.