టీమిండియా క్రికెట్ ప్లేయర్లకు ఇది ఓ రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి.విదేశీ లీగ్లలో ఆడేందుకు ఎట్టి పరిస్థితుల్లో టీమిండియా ప్లేయర్లను అనుమతించేది లేదని తాజాగా BCCI తేల్చి చెప్పేసింది.
ఒకవేళ విదేశీ లీగ్ లలో ఆడాలనుకుంటే.భారత క్రికెట్తో తెగదెంపులు జరుగుతాయని హెచ్చరించింది.
ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటు. IPL, దేశవాలీ క్రికెట్కు గుడ్ బై చెప్పాలని సూచించింది.
ఏవరికైనా ఇదే రూల్ వర్తింస్తుందని BCCI చెప్పడం కొసమెరుపు. సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ టీమ్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసే ఉంటుంది.
ఇక్కడే వచ్చింది అసలు చిక్కు.
ఈ జట్టుకు MS ధోనిని మెంటార్‌గా నియమించాలని CSK యాజమాన్యం భావించింది.
దానికి BCCI అనుమతి కోరగా BCCI చెన్నై జట్టుకు షాకిచ్చింది.అనుమతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం మొండికేసింది.ధోని కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు.ఎంతటివారైనా ఖచ్చితంగా BCCI నిబంధన పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.ప్రస్తుతం ధోని అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చినా.IPLలో CSKకి కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
అతను వచ్చే సీజన్‌లోనూ ఆడతానని ప్రకటించాడు.దీంతో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనాలంటే ధోని IPLకి దూరం కావాల్సి ఉంటుందని BCCI పేర్కొంది.

ఇకపోతే ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక.కేవలం IPL మాత్రమే ఆడుతున్నాడు.తాజాగా సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ లో పాల్గొనేందుకు చెన్నై జట్టు అనుమతి కోరడంతో.BCCI ధోనికే ఆప్షన్ ను వదిలేసింది.IPL లేదా సౌతాఫ్రికా T20 లీగ్… రెండింట్లో ఒక్కదాన్ని ఎంచుకోవాలని సూచించింది.దీంతో ధోని ఆలోచనలో పడ్డాడు.
BCCI ప్రకటనతో సౌతాఫ్రికా T20 లీగ్‌లో పాల్గొనాలనే ఆలోచనను ధోని విరమించుకున్నట్లు తెలుస్తోంది.ఇక BCCI అనుమతి ఇవ్వకపోవడంతో.
వచ్చే ఏడాది IPL అనంతరం ధోనీ సేవలను మెంటార్‌గా తమ జట్లకు వాడుకోవాలని యోచిస్తోంది.