వామ్మో.. ఒక సెంచరీ చేస్తే బీసీసీఐ అంత డబ్బు ఇస్తుందా?

క్రికెట్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

 Do You Know How Much Bcci Will Pay To Cricket Players, Sports News. Bcci, Cricke-TeluguStop.com

క్రికెట్ గల్లీ ఆట అయిన స్టేడియంలో ఆట అయిన చూసే ప్రేక్షకులకు ఎంతో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.అందుకే ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది అంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు ఎంతోమంది.

అయితే భారత ఆటగాళ్లు వారి ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ప్రపంచంలో రిచ్చెస్ట్ క్రికెట్ క్లబ్ గా పేరున్న బీసీసీఐ… ప్రపంచంలో ఏ దేశానికి ఇవ్వనంత డబ్బు ఇండియన్ క్రికెటర్ కి సాలరీ, బోనస్ ల రూపంలో చెల్లిస్తుంది.

ఆటగాళ్ళ పర్ఫామెన్స్ ఆధారంగా వారికి శాలరీ బోనస్ ల రూపంలో అందిస్తూ వారిని ప్రోత్సహిస్తోంది బీసీసీఐ.అయితే వారికి శాలరీలు, బోనస్లు ఏ విధంగా అందిస్తారో ఇక్కడ తెలుసుకుందాం.

ఒక ప్లేయర్ టెస్ట్ మ్యాచ్ ఆడితే 15 లక్షల రూపాయలు వారికి బోనస్ గా ఇస్తుంది.

వన్డే మ్యాచ్ ఆడితే ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తుంది.

టి 20 ఆడితే మూడు లక్షల రూపాయలు.మ్యాచ్ ఫీజులు గ్రే లతో సంబంధంలేకుండా బిసిసిఐ చెల్లిస్తుంది.

ఒక ప్లేయర్ సెంచరీ చేసినప్పుడు ఐదు లక్షలు, డబుల్ సెంచరీ చేసినప్పుడు ఏడు లక్షల ను బోనస్ గా చెల్లిస్తుంది.

ఒక ప్లేయర్ ఐదు వికెట్లు తీసినట్లయితే, అతనికి 5 లక్షల రూపాయలు బోనస్ గా ఇస్తారు.

A+ కేటగిరి లో ఉన్న ఆటగాళ్లకు ప్రస్తుతం బీసీసీఐ ప్రతి సంవత్సరం ఏడు కోట్ల రూపాయలను ఫిక్స్డ్ అమౌంట్ గా చెల్లిస్తుంది.

A కేటగిరి లో ఉన్న ఆటగాళ్లకు 5 కోట్లు.

B కేటగిరి లో ఉన్న ఆటగాళ్లకు మూడు కోట్లు.

C కేటగిరి లో ఉన్న ఆటగాళ్లకు కోటి రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం చెల్లిస్తుంది.

ఇప్పుడు ఒప్పుకుంటారా? మన బీసీసీఐ ప్రపంచంలోనే రిచ్చెస్ట్ క్రికెట్ క్లబ్ అని.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube