సెంచరీ కొడితే క్రికెటర్లకు బీసీసీఐ ప్రకటించే బోనస్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ప్రపంచంలో క్రికెట్ కు ఉన్నంత మంది అభిమానులు మరే క్రీడకు లేరని చెప్పుకోవచ్చు.ఈ క్రీడ తొలుత ఇంగ్లాండ్ లో పుట్టినా.

 Bcci Bonus Prize Money For Cricketers-TeluguStop.com

ప్రస్తుతం భారత్ లో ఓ రేంజిలో వర్ధిల్లుతోంది.క్రికెట్ అంటేనే ఇండియన్స్ పండగలా ఫీలవుతారు.

ఇండియా, పాక్ మ్యాచ్ అంటే ఇక క్రికెట్ ఫ్యాన్స్ సంతోషానికి అవదులు ఉండవు.ప్రపంచంలోనే టాప్ టీంగా టిమిండియా కొనసాగుతుంది.

 Bcci Bonus Prize Money For Cricketers-సెంచరీ కొడితే క్రికెటర్లకు బీసీసీఐ ప్రకటించే బోనస్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే.ప్రపంచంలోనే రిచ్చెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ.

ప్రపంచంలో ఏ బోర్డుకు లేనంత సంపద బీసీసీఐ దగ్గర ఉంది.అంతేకాదు.ప్రపంచంలోని మిగతా ఏ దేశాలు ఇవ్వలేనంత డబ్బును క్రికెటర్లకు సాలరీస్, బోనస్ రూపంలో అందిస్తుంది.ప్లేయర్ల ఆటతీరు ఆధారంగా ఆయా కేటగిరీలుగా విభజిస్తుంది.

ఆయా కేటగిరీకి చెందిన క్రికెటర్లకు ఒక్కో రేంజిలో డబ్బులు ముట్టజెప్తుంది.అంతేకాదు.

బోనస్ లు కూడా భారీగా ప్రకటిస్తుంది.ఒక్కో మ్యాచ్ కు ఇంత.సెంచరీ చేస్తే ఇంత.5 వికెట్లు పడగొడితే ఇంత అంటూ బంఫర్ ఆఫర్లు ఇస్తుంది బీసీసీఐ.

Telugu A Category Players Bonus, Bcci, Cricket, Cricket India, Cricket Salaries, Cricketers Salary, One Day Match Players Salary, T 20 Playes, Test Match Players-Sports News క్రీడలు

అటు ఒక ప్లేయర్ టెస్ట్ మ్యాచ్ ఆడితే రూ.15 లక్షలు ఇసస్తుంది.వన్డే ఆడితే రూ.6 లక్షలు ఇస్తుంది.టి-20 అయితే రూ.3 లక్షలు ఇస్తుంది.మ్యాచ్ ఫీజుల ను గ్రేడ్ లతో సంబంధం లేకుండా ఇస్తుంది.ఒక ప్లేయర్ సెంచరీ చేసినా లేదంటే 5 వికెట్లు తీసినా.వారికి రూ.5 లక్షలు బోనస్ గా ఇస్తుంది.డబుల్ సెంచరీ చేస్తే రూ.7 లక్షలు అందిస్తుంది.మరోవైపు కేటగిరీలుగా ఆయా క్రీడాకారులకు ఫిక్స్డ్ అమౌంట్ అందజేస్తుంది.టీమిండియాలోనే A+ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు బీసీసీఐ ఏటా రూ.7 కోట్లు చెల్లిస్తుంది.A కేటగిరి క్రీడాకారులకు రూ.5 కోట్లు అందిస్తుంది.B కేటగిరి ప్లేయర్లకు రూ.3 కోట్లు చెల్లిస్తుంది.C కేటగిరి క్రీడాకారులకు కోటి రూపాయల చొప్పున ఇస్తుంది.

#OneDay #BCCI #Cricket #Cricket India #ACategory

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు