సీఎం జగన్ ని సత్కరించిన బీసీ నాయకులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులు ఫుష్పగుశ్చాలను అందజేసి దుశ్సాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు.అగ్ర కులాల లో వెనుకబడిన పేద వారిని ఆదుకునే రీతిలో నెల రోజుల క్రితం కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో క్షత్రియ సామాజిక వర్గం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ సత్కరించడం జరిగింది.

 Bc Leaders Honor Cm Jagan-TeluguStop.com

అనంతరం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సీఎం జగన్ ని తాడేపల్లి లో కలిసి బీసీ వర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు గురించి చర్చించ శాలువా కప్పి అభినందించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కృష్ణయ్య వైయస్ జగన్ ని పొగడ్తలతో ముంచెత్తారు.రాష్ట్రంలో ఎక్కడ అవినీతి కి చోటు లేకుండా పరిపాలన అందిస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు.

 Bc Leaders Honor Cm Jagan-సీఎం జగన్ ని సత్కరించిన బీసీ నాయకులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా కాంట్రాక్టులకు సంబంధించి బీసీ వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించడం జరిగింది అని పేర్కొన్నారు.అదేరీతిలో రాజ్యసభలో చరిత్రాత్మక బీసీ బిల్లు విషయంలో వైసిపి వ్యవహరించిన తీరు బీసీ వర్గాల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు.

#Jagan #Ysrcp #Assembly #BC Leaders #Nominated Posts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు