ఆ వ‌ర్గం దూరం కావ‌డ‌మే టీడీపీకి పెద్ద న‌ష్టం.. జ‌గ‌న్‌కు బాగానే క‌లిసి వ‌స్తోందే..

ఏ పార్టీకి అయినా స‌రే ఆ రాష్ట్రంలో ఉండే బ‌ల‌మైన వ‌ర్గాలు అండ‌గా ఉంటేనే ఆ పార్టీ మ‌నుగ‌డ అనేది సాధ్యం అవుతుంది.అయితే ఒక‌ప్పుడు జాతీయ పార్టీలు ఉన్న స‌మ‌యంలో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి బలమైన పునాదులు వేశారు ఎన్టీఆర్‌.

 Bc Community Separation Big Loss To Tdp Chandrababu, Tdp, Chandrababu, Ys Jagan,-TeluguStop.com

ఇక ఆయ‌న పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి పార్టీకి బీసీ సామాజిక వర్గమే అండ‌గా నిలుస్తూ వ‌స్తోంది.అయితే ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పార్టీ వ‌చ్చిన త‌ర్వాత బీసీలు దూరమవ్వడం స్టార్ట్ అయింది.

ఇక అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పార్టీకి వారు దూరంగానే ఉంటున్నారు.

ఇక వీరి ఎఫెక్ట్ మొన్నటి ఎన్నికల సంద‌ర్భంగా చాలా క్లియ‌ర్ గా క‌నిపించింది.

చంద్రబాబు పార్టీ టికెట్ల కేటాయింపు ద‌గ్గ‌రి నుంచి ప్రతి విష‌యంలో కూడా బీసీలకు పెద్దగా చేఇసంది ఏమీలేదు.ఇక ఈ విష‌యంలో జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఆయ‌న పార్టీలో బీసీలకు పెద్దపీట వేసి వారికే ఎక్కువ‌గా టికెట్లు ఇవ్వ‌డంతో పాటు మంత్రి ప‌ద‌వుల్లో కూడా వారికి ఎక్కువ సీట్లు ఇవ్వ‌డంతో బీసీల్లో చీలికవచ్చి ఓ వర్గం వైసీపీకి అండ‌గా నిలబడింది.ఇక అప్ప‌టి నుంచి జ‌గ‌న్ పూర్తిగా బీసీల‌ను త‌న‌వైపు తిప్పుకునేందుకు ప్ర‌త్యేక ప్లాన్ వేస్తున్నారు.

Telugu Bc Community, Bccommunity, Bc, Chandrababu, Jagan, Ycp, Ys Jagan-Politica

కానీ టీడీపీ మాత్రం ఇందుకు భిన్నంగా మారింది.చంద్రబాబు లాగే అందులో ప‌నిచేస్తున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తలను పెద్దగా పట్టించుకోవ‌ట్లేదు.వారు అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా వ్యక్తిగత పనులు లేదంటే కాంట్రాక్టు ల‌వ‌ర‌కు మాత్ర‌మే త‌మ ఫోక‌స్ పెట్టారు త‌ప్ప బీసీ కార్య‌క‌ర్త‌ల‌ను గానీ లేదంటే బీసీ వ‌ర్గాల‌కు సంబంధించిన ప‌నుల‌ను పూర్తిగా నిర్ల‌క్ష్యం చేశారు.దీంతో ఆ వ‌ర్గాలు టీడీపీకి దూరంగా ఉండిపోయారు.

ఇక మొన్న రిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల‌కు కూడా బీసీ వ‌ర్గాల్లోని కార్య‌క‌ర్త‌లు ముందుకురాలేదంటేనే పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలు్తోంది.మ‌రి చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా మేలుకుంటారో లేదో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube