ముందు నోరు జారడం... ఆపై నాలుక్కరుచుకోవడం ! ఇదే నేటి రాజకీయం !

ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఏమైనా చేసేస్తారు.ఎన్నియలు సమీపిస్తున్న సమయంయంలో వారు పడే పాట్లు అన్ని ఇన్ని కాదు.

 Bc Community Leaders Fires On Ys Jagan Comments-TeluguStop.com

ప్రజలు అడిగిందే తడవుగా ఆచరణ సాధ్యమా .? కాదా అనే ఆలోచన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన హామీలు గుప్పించేస్తుంటారు.కానీ వాస్తవంలోకి వచ్చేసరికి వాటిని అమలు చేయలేక , ప్రజలకు సమాధానం చెప్పలేక తెగ తంటాలు పడిపోతుంటారు.ప్రస్తుత రాజకీయ పార్టీలనే తీసుకుంటే అన్ని పార్టీలు కూడా అధికారమే పరమావధిగా ప్రజలను మోసగించేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.

ఇక ఈ విషయంలోకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని పరిగణలోకి తీసుకుంటే ఆయన గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు లెక్కా పత్రం లేదు.దాదాపు ప్రజలకు 600 హామీలను ఆయన ఇచ్చాడు.వాటిలో అమలయినవి మాత్రం వేళ్ళ మీద లెక్కపెట్టుకునేవే.ఏపీలో యూటర్న్ రాజకీయ నాయకులలో ముందుగా గుర్తుకు వచ్చేది సీఎం చంద్రబాబు నాయుడు.2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఎన్నిసార్లు యూటర్న్ రాజకీయాలు చేశారో అందరికీ తెలిసిందే.అందరికీ తెలసినా నాదే రైట్ టర్న్‌రాజకీయాలంటూ యొల్లో మీడియాతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం ఆయనకు మామూలే.

ఇక ఏపీకి పెట్టుబడుల వరద వస్తోందని ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి చెబుతున్నా… ఆ జాడే కనబడడం లేదు.అరకొరగా కొన్ని వచ్చినా… బాబు చెప్తున్నట్టుగా వరద అయితే రాలేదు.

గత ఎన్నికలకు ముందు చేపట్టిన ప్రచారంలో భాగంగా…తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా అన్నేళ్లు ఇస్తామని, మోదీ , చంద్రబాబు, వెంకయ్య నాయుడు హామీలు ఇచ్చారు.కానీ ఆ సంగతి మర్చిపోయి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించేస్తున్నారు.చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి మరీ ఏపీకి ప్రత్యేక హోదా అవసరమే లేదని, ప్రత్యేక ప్యాకేజి సరిపోతుందని అసెంబ్లీలనే గొంతు చించుకుని మరీ చెప్పాడు.కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో హోదా నే కావాలి అంటూ బాబు అమాయకుడిలా మాట్లాడుతున్నాడు.

తాజాగా కాపు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ యూటర్న్ తీసుకున్నారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విమర్శలు చేశారు.తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగ సభలో కాపులకు రిజర్వేషన్లు కల్పించడం నాచేతిలో లేదని కేంద్రం చేతిలో ఉందని జగన్‌ చెప్పడం ఇప్పుడు వివాదస్పదం అవుతోంది.

తాను చేయగలినవే చెబుతానని, చంద్రబాబులా మోసం చేయలేనని జగన్‌ చెప్పడం ముద్రగడకు నచ్చలేదు.కాపు రిజర్వేషన్లను అసెంబ్లీలో సమర్థించిన జగన్ ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నాడని ముద్రగడ ఆరోపిస్తున్నారు.

జనసేన అధినేత పవన్‌ యూటర్న్‌లు ఉన్నాయి.గొంతు చించుకుని మరీ బరువైన డైలాగులు చెప్పడం తప్ప ఏ పనీ చేయలేదు.

కేంద్రంపై అవిశ్వాసం పెట్టండి నేను 50 మంది ఎంపీల మద్దతు కూడగడతా అంటూ పవన్ గొప్పలు చెప్పుకున్నాడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు.ఈ సంగతి అందరికి తెలుసు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube