బీబీసీ వరల్డ్ ని కదిలించిన బాలు మరణం  

BBC International Telecast News On SP Balu, Tollywood, Indian Cinema, Legendary Singer, SP Balasubramanyam, Bollywood - Telugu Bbc International Telecast News On Sp Balu, Bollywood, Indian Cinema, Legendary Singer, Sp Balasubramanyam, Tollywood

గాన గాంధర్వుడు, దేశం మెచ్చిన స్వర మాంత్రికుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం దేశం మొత్తాన్ని కదిలించింది.ప్రపంచంలో ఎవ్వరికి సాధ్యం కానీ విధంగా ఏకంగా తొమ్మిది బాషలలో నలభై వేలకి పైగా పాటలని పాడి ఎంతో మంది గాయకులకి స్ఫూర్తిగా నిలిచిన గొప్ప వ్యక్తి.

TeluguStop.com - Bbc International Telecast News On Sp Balu

కోట్ల మంది ప్రజలని తన గొంతుతో సేదతీర్చిన స్వర దిగ్గజం.సినీ జగత్తులో ఎవరూ అందుకోలేని కీర్తి కిరీటాలు, కోట్ల మంది ప్రజల అభిమానం ఎస్పీ బాలు సొంతం చేసుకున్నారు.

అలాంటి వ్యక్తి మరణం కేవలం దేశానికే కాదు యావత్ ప్రపంచాన్ని కచ్చితంగా దుఖప్రాయం అని చెప్పాలి.అందుకే అంతర్జాతీయ స్థాయిలో ఆయన మరణం ఒక వార్తగా మారింది.

TeluguStop.com - బీబీసీ వరల్డ్ ని కదిలించిన బాలు మరణం-General-Telugu-Telugu Tollywood Photo Image

కేవలం అంతర్జాతీయ వార్తలకే ప్రాధాన్యత ఇచ్చే బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ అయిన బీబీసీ చానల్ ఎస్పీ బాలు మరణం మీద ప్రత్యేక కథనం ప్రసారం చేసింది.ఆ కథనం చూసిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఆయిన ఖ్యాతి ఉందని అర్ధమైంది.

సీనియర్ మూవీ గాయకుడు ఎస్పి బాల సుబ్రహ్మణ్యం మరణించారని, అతన్ని అందరూ ముద్దుగా ఎస్పీబీ అని పిలుచుకుంటారని బీబీసీ యాంకర్ వార్తలు చదవడం విశేషం.74 ఏళ్ల వయసున్న బాలు యావత్ దక్షిణ భారత సినీ రంగంలోనే ఎంతో ప్రతిభావంతులని, ఈ క్రమంలో ఆయన సేవలకు గాను పద్మశ్రీ అవార్డు భారత ప్రభుత్వం ఇచ్చిందని యాంకర్ గుర్తు చేసింది.అలాగే అతను నలభై వేలకి పైగా పాటలని తొమ్మిది బాషలలో పాడటం ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారని, ప్రధాని నరేంద్రమోడీ అతని మరణంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారని బీబీసీ న్యూస్ చానల్ ప్రస్తావించింది.బీబీసీ లాంటి వరల్డ్ క్లాస్ చానల్ లో ఎస్పీ బాలు మరణ వార్త ప్రచారం చేయడం ద్వారా అతనికి అంతర్జాతీయ గుర్తింపు అందించింది అని చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bbc International Telecast News On Sp Balu Related Telugu News,Photos/Pics,Images..