సన్నీకి రూ. 100 కోట్ల కట్నం ఆఫర్ చేసిన ఆంటీ అసలు విషయం క్లారిటీ

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 విన్నర్ గా నిలిచిన వీజే సన్నీ కి సోషల్ మీడియా లైవ్ లో ఒక ఆంటీ తన కూతురును ఇచ్చి వంద కోట్ల కట్నం ఇస్తానంటూ ఆఫర్‌ చేసింది.ఆ విషయం సోషల్‌ మీడియాలో ఎంతటి వైరల్‌ అయ్యిందో అందరికి తెల్సిందే.

 Bb5 Winner Vj Sunny On Line Live Marriage Proposal May Be Fake-TeluguStop.com

సన్నీ విజేతగా నిలిచి దక్కించుకున్నది 50 లక్షల ప్రైజ్ మనీ.సిటీ శివారు ప్రాంతంలో 10 లక్షలు లేదా 15 లక్షలు విలువ చేసే ప్లాట్‌.50 లక్షల ప్రైజ్ మనీ లో ఆయనకు దక్కేది 35 లక్షలను గానే చెబుతున్నారు.మొత్తంగా ఆయనకు పారితోషికం.

ప్రైజ్ మనీ.బహుమానాలు కలిపి 60 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది.కాని క్రేజ్‌ మాత్రం ఆయనకు కోట్ల రూపాయల విలువ చేసేది దక్కింది అనడంలో సందేహం లేదు.ఆయన క్రేజ్‌ ముందు అంతా కూడా చిన్నబోయి చూస్తున్నారు.ఇంతకు ముందు వరకు ఆయన గురించి పెద్దగా మాట్లాడుకునే అవకాశం లేదు.కాని ఇప్పడు ఆయన ఒక స్టార్‌.

తెలుగు ప్రేక్షకుల్లో ఆయన క్రేజ్ అంతా ఇంతా కాదు.

అందుకే ఆయన్ను పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు.తమ ఇంటి అల్లుడిగా మార్చుకోవాలని ఆంటీలు అంకుల్స్‌ అంతా ఆసక్తిగా ఉన్నారు అనడం లో సందేహం లేదు.ఇలాంటి సమయంలో వంద కోట్ల కట్నం ఆఫర్‌ నిజమే అయ్యి ఉంటుందని కొందరు భావించారు.

కాని తాజాగా సన్నీ అమ్మ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వంద కోట్ల కట్నం విషయం నాకు తెలియదు.నేను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఎందుకంటే అలాంటి ఆన్‌ లైన్ మాటలు ఫేక్ లేదా ప్రాంక్ అయ్యి ఉంటాయి.అందుకే ఆ విషయంలో సన్నీ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.

వంద కోట్ల ఆఫర్‌ చేసిన ఆ లేడీ ఎవరు అనేది క్లారిటీ లేదు.ఆమె జెన్యూన్ గానే వంద కోట్లు ఆఫర్‌ చేసి ఉంటే ఇప్పటికే ఆమె మీడియా ముందుకు వచ్చి మరింత క్లారిటీ ఇచ్చేది.

కాని ఆమె ఊసే లేదు కనుక ఆమె ఫేక్ అంటూ చాలా మంది మెల్ల మెల్లగా ఒక ఒపీనియన్‌ కు వస్తున్నారు.

VJ Sunny Marriage Proposal with 100Crore is Fake

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube