BB4: ఈవారం ఇంటి నుంచి ఆవిడేన ఔట్..!

బిగ్‌బాస్‌ సీజన్ 4 ఎలిమినేషన్ లు ఎవరు ఊహించని విధంగా జరుగుతున్నాయి.ప్రజలు వేసిన ఓట్లకు వ్యతిరేకంగానే ఎలిమినేషన్ లు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినబడుతున్నాయి.

 Bb4: ఈవారం ఇంటి నుంచి ఆవిడేన ఔట్..-TeluguStop.com

ఈ సారి నామినేషన్ ప్రక్రియ లో అభిజిత్, హారిక, సోహైల్ వంటి బలమైన కంటెస్టెంట్ లు ఉండగా.ఒక్క మోనాల్ మాత్రమే వీక్ కంటెస్టెంట్ గా కనిపించింది.

దీనితో ఆమెనే ఇంటికి వెళ్లి పోతుంది అని అందరూ ఊహించారు.కానీ అందరి అంచనాలను ఉల్టా చేస్తూ బలమైన కంటెస్టెంట్ గా భావించే లాస్య ని బిగ్‌బాస్‌ ఇంటికి పంపించేశారట.

జోరుగా జరుగుతున్న ప్రచారం ప్రకారం యాంకర్ లాస్య మంజునాథ్ ఇంటికి వెళ్ళిపోయారు అని తెలుస్తోంది.

నిజంగా ఇది షాకింగ్ ఎలిమినేషనే కాగా.

మోనాల్ ఓటింగ్ ప్రక్రియ చివరి రోజున చాలా ఎక్కువ ఓట్లు పొందారని తెలుస్తోంది. లాస్య అందరిలాగా గొడవ పెట్టుకోరు.

కేవలం కిచెన్ కే పరిమితమైన లాస్య కి ఎక్కువగా స్క్రీన్ టైం కూడా దొరకదు.ప్రేక్షకులకు ఇష్టమైన కంటెస్టెంట్ వెళ్ళిపోయినప్పుడల్లా.

అందరూ లాస్యనే టార్గెట్ చేస్తున్నారు.లాస్య ఆట ఆడదు అని.సేఫ్ గేమ్ తప్ప ఆమెకు ఏమి చేతకాదని.ఆమెను ఎలిమినేట్ చేస్తే బాగుండేదని తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కాతారు ప్రేక్షకులు.

గతంలో కూడా నోయెల్ ని ఇంటికి పంపించాలని ప్రేక్షకులు పెద్ద ఎత్తున బిగ్‌బాస్‌ ని టార్గెట్ చేసేవారు.ఫినాలేకి బిగ్‌బాస్‌ సీజన్ 4 దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరూ మంచిగా ఆడవారే ఉండాలని.

సేఫ్ గేమ్ ఆడే రాయలసీమ బిడ్డ అయిన లాస్య ని ఇంటికి వెళ్ళగొట్టారు బీబీ నిర్వాహకులు.

ఇప్పుడిప్పుడే అఖిల్ ని దూరం పెడుతూ సొంతంగా ఆడటానికి సిద్ధమైన మోనాల్ గజ్జర్ హౌజులో కొన్ని రోజులు ఉంటే బాగుంటుందని ప్రేక్షకులతో పాటు బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అనుకున్నట్టు తెలుస్తోంది.

అందుకే మోనాల్ కి చివరిసారిగా ఒక అవకాశం కల్పించారు.మరి లాస్య వెళ్ళిపోయిన తర్వాత, అఖిల్ తో విడిపోయిన తర్వాత హౌజులో మోనాల్ ఒంటరి పక్షి అవుతుందని చెప్పుకోవచ్చు.

ఈ పరిస్థితులలో ఆమె ఆట ఎలా కొనసాగుతుందో చూడాలి.నిన్నటి ఎపిసోడ్ లో కూడా ఏడవకుండా ఉండటానికి ప్రయత్నించి అందరిని ఆశ్చర్యపరిచింది మోనాల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube