మళ్లీ గర్జించిన బాలయ్య.. సినిమా చూపిస్తోన్న బొమ్మ!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Bb3 Teaser Animation Video Goes Viral, Balakrishna, Animation, Boyapati, Bb3 Tea-TeluguStop.com

ఇక ఈ సినిమా టీజర్‌ను బాలయ్య పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.కాగా ఈ సినిమా టైటిల్ ఏమిటనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

అయితే ఈ చిత్ర టీజర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.కాగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను మరోసారి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

అయితే ఈసారి రిలీజ్ అయ్యింది యానిమేషన్ టీజర్.యానిమేషన్ బాలయ్య డైలాగులు చెబుతుంటే నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.సింహం ఎలా ఉన్నా సింహమే అని వారు అంటున్నారు.యానిమేషన్ టీజర్ చూస్తుంటే కూడా అదే పవర్‌ఫుల్ ఎనర్జీ కనిపిస్తుందని వారు అంటున్నారు.

బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, అందులో ఒకటి రైతు పాత్ర కాగా మరొకటి అఘోరా పాత్ర అని తెలుస్తోంది.ఈ సినిమాను బాలయ్యతో పాటు బోయపాటి కూడా చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారు.

వారిద్దరు ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube