మురికి నీళ్ళు కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటి అరిష్టమా? ఎందుకు?

చాలా మంది ఆధునిక యుగం అనే పేరిట శతాబ్దాల తరబడి వారసత్వంగా వస్తున్న ఆచార సంప్రదాయాలను తప్పుబడుతూ ఉంటారు .అయితే ఇలాంటి ఆచార సంప్రదాయాల విషయంలో కొంచెం తర్కం ఉపయోగించాలి.

 Battalu Uthikina Neellu Kalla Meeda Posukunte-TeluguStop.com

అన్ని ఆచారాలను మూఢ నమ్మకాల పేరుతో కొట్టిపారేయకూడదు.అలా అని అన్నీ ఆచారాలను గుడ్డిగా నమ్మకూడదు

అందుకే ఆ ఆచార సంప్రదాయల పుట్టు పుర్వోత్తరాలను కాస్త అవగాహన చేసుకుంటే వాటిని మానేయాలా? కొనసాగించాలా? అన్న అంశంపై హేతుబద్ధంగా నిర్ణయం తీసుకోవచ్చు.ఇలాంటి నమ్మకాల్లో బట్టలు ఉతికిన నీళ్లు కాళ్లపై పోసుకోకూడదనేది ఒకటి.చాలా మంది స్త్రీలు బట్టలు ఉతికిన తర్వాత జాడించేసి.ఆ నీళ్లును పారబోస్తూ తమ కాళ్లపై పోసుకుంటారు.అయితే

అలా చేస్తే తమ కాళ్లు శుభ్రమవుతాయని భావించడం ఓ కారణం.

కానీ అలా చేయడం తప్పని.అలా చేస్తే పుట్టింటి వారికి అరిష్టమని పెద్దలు చెబుతారు.

కాళ్లపై నీళ్లు పోసుకుంటే ఎక్కడో ఉన్న పుట్టింటివారికి అరిష్టం ఎందుకవుతుందని చాలామంది కొట్టిపారేస్తారు.దీన్ని ఆచారం అనడం కంటే అలవాటు అని చెబితే బావుంటుంది

స్త్రీలు అలా ఎక్కువ కాలం నీళ్లలో ఉండటం వల్ల కాళ్లు పాడవుతాయి.

నీళ్లలో నాని నాని పగుళ్లు వస్తాయి.అలాంటి పగుళ్ల ద్వారా బట్టలు ఉతికినప్పుడు వాటిలోని సూక్ష్మ క్రిములు పగుళ్ల ద్వారా వారి కాళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

దాని ద్వారా వారు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.కొందరు భర్తలు భార్యలతో అడ్డమైన చాకిరీ చేయించుకుంటారు

అదే భార్యలు కాస్త అనారోగ్యానికి గురైనా చాలు.

వాళ్లకు సేవ చేయాల్సి వస్తుందన్న భయంతో.సేవ చేసే ఓపిక లేక పుట్టింటికి పంపేస్తారు.

పుట్టింటివారు కాస్త ఓపికమంతులు, స్థితిమంతుల అయితే పర్వాలేదు.లేకపోతే.

ఇబ్బందే కదా.అందుకే బట్టలు ఉతికిన నీళ్లు కాళ్లపై పోసుకోకూడదు అంటారు.పుట్టింటి వారికి ఇబ్బంది అని చెప్పే కోణంలో అరిష్టమని చెప్పి ఉండొచ్చు.ఇదీ అసలు సంగతి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube