తగ్గేదేలే: అతడు కొట్టిన దెబ్బకు మూవింగ్ రోబో కెమేరా ఉష్..!

ఐపిఎల్ లో సిక్సర్ల వర్షం కురుస్తోంది.ఫోర్ల ప్రవాహం సాగుతోంది.

 Batsman Nitesh Rana Shot Makes The Ball To Hit Robo Cam In Ipl Match Vs Srh, Vir-TeluguStop.com

మామూలుగా వన్డే మ్యాచులోనే ఈ మధ్యకాలంలో బ్యాటర్లు షాట్లు కొడుతున్నారు.అసలే ఐపిఎల్.

కాబట్టి సిక్సులు బాదాల్సిందే.ఒకప్పుడు సిక్సులు కొడితే బాల్స్ అంత దూరం వెల్లాయా అని చెప్పుకునేవారు.

కానీ ఇప్పుడు ఆ షాట్ కు ఏదో ఒకటి పగిలి తీరాల్సిందేనని ఫ్యాన్స్ పందేలు వేసుకుంటున్నారు.అప్పటి రోజుల్లో బాల్ ఏ ప్రాంతంలో పడిందో చెప్పడానికి అంపైర్లు, కెమెరామెన్లు కష్టపడేవాళ్లు.

ఇప్పుడు రకరకాల కెమెరాలు రావడం వల్ల బాల్ ఎక్కడికి వెళ్తుందో సులభంగా తెలుసుకోవచ్చు.బ్లైండ్ స్పాట్‌ లను చూసి కెమేరాలను పెట్టి బాల్ ఎక్కడ పడిందో అప్పట్లో తెలుసుకునేవాళ్లు.

ఆ సమయంలో 360 డిగ్రీల కోణంలో ఆటగాళ్లు షాట్లను కొడితే కెమేరామెన్లకు చాలా ఇబ్బందిగా ఉండేది.బాల్ కూడా ప్రేక్షకుల మీద పడేది కూడా తెలిసేది కాదు.

అయితే ఇప్పుడు టెక్నాలజీ మారింది.టెక్నాలజీ పెరిగిన తర్వాత స్పైడర్ క్యామ్‌ లు, రోబో క్యామ్‌ ల వినియోగం మైదానంలో పెరిగింది.

దాని వల్ల ప్రేక్షకులు ఎన్నో యాంగిల్స్‌లో బాల్ వెళ్లడం కళ్లారా చూడొచ్చు.

గతంలో భారీ షాట్లు కొట్టినప్పుడు స్పైడర్ క్యామ్ తీగలకు బాల్ తగిలేది.

ఆ టైంలో తీగలకు తగిలినా ఫీల్డర్ క్యాచ్ చేసినా అవుట్ అనేది ఇచ్చేవారు కాదు.ఒక్కోసారి బాల్ బలంగా తగిలితే కెమేరా స్ట్రక్ అయిపోయి పగిలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ జరిగింది.

Telugu Robo Cam, Batsmannitesh, Camera, Ipl, Kkr Srh, Robo Camera, Latest-Latest

ఆ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ నితీశ్ రాణా బలమైన షాట్ ఆడాడు.నితిశ్ రాణా కొట్టిన షాట్‌కు రోబో కెమేరా లెన్స్ కూడా పగిలిపోవడంతో అందరూ అవక్కయ్యారు.నితీశ్ రాణా మిడ్ వికెట్ మీదుగా బాల్ ను బలంగా కొట్టడంతో బాల్ బౌన్స్ అయ్యి నేరుగా కెమేరా లెన్స్‌కు తాకింది.

దీంతో ఆ కెమేరా లెన్స్ అద్దం పూర్తిగా పగిలిపోయింది.రషీద్ ఖాన్ బాల్ ను పట్టుకుంటాడని చూస్తుండగా కెమెరాను అక్కడే నిలిపేశారు.ఆ సమయంలోనే బాల్ అనూహ్యంగా రషీద్ ఖాన్‌ ను కూడా తప్పించుకొని కెమేరాను ఢీకొంది.దీంతో కెమెరా పగిలిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube