కోళ్లతో పాటు గబ్బిలాలు కూడా, ఆందోళనలో ప్రజలు

ఇటీవల ఒక వైరస్ సోకి కోళ్లు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే.అయితే ఒకపక్క కరోనా భయం తో అల్లాడుతున్న జనాలు ఇలా కోళ్లు మృతి చెందుతుండడం అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది.

 Bats Virus Effected In Kerala-TeluguStop.com

అయితే అక్కడ కోళ్లు మాత్రమే కాకుండా గబ్బిలాలు కూడా మృత్యువాత పడుతుండడం అక్కడి ప్రజలను మరింత ఆందోలనకు గురిచేస్తున్న అంశం.అసలే కరోనా భయంతో బిక్కబిక్కుమంటూ గడుపుతోన్న ఈ సమయంలో కేరళ లోని కొజిక్కొడె జిల్లాలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

వెంటనే జంతు సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో, వారు వచ్చి చనిపోయిన గబ్బిళాల నుంచి శాంపిల్స్ సేకరించారు.అయితే ఈ పరీక్షల ఫలితాలు రావడానికి టైమ్ పట్టేలాఉంది.

జిల్లా పశుసంవర్ధక అధికారి డీఆర్ కెవి ఉమా మాట్లాడుతూ….మా అధికారులు పరీక్షల కోసం చనిపోయిన గబ్బిలాల నుండి నమూనాలను సేకరించారు.

చనిపోయినవాటిన్నింటిని కాల్చి బూడిద చేశాం.పరీక్ష ఫలితాలకు కొన్ని రోజులు సమయం పడుతుంది అప్పుడే ఈ విషయం పై ఒక నిర్ధారణకు రాగలం అంటూ చెప్పుకొచ్చారు.

అసలుకే కరోనా ప్రపంచదేశాలను భయపెడుతుంటే ఇప్పుడు ఈ కొత్త వైరస్ ఏంటా అని కేరళ వాసులు ఆందోళన చెందుతున్నారు.కొజిక్కెడ్ జిల్లాలో రెండు పౌల్ట్రీ ఫామ్స్‌లో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కోళ్లు వందల సంఖ్యలో చనిపోవడంతో టెస్టులు చేసిన అధికారులు.Type-A Influenzaకు సంబంధించిన H5, H7 వైరస్‌ అందుకు కారణంగా నిర్ధారించారు.

దీంతో వెంటనే అలర్టయిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్, ఆ కోళ్ల ఫామ్స్‌కు ఒక కిలోమీటర్ పరిధిలో సంచరిస్తోన్న 1200వరకు రకరకాల పక్షుల నమూనాలను సేకరించారు.ఆ కోళ్ల ఫారం నుంచే వైరస్ గబ్బిలాలకు సోకిందని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.

ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి 10కిలోమీటర్ల దూరం వరకూ షాపుల్లో కోళ్లను, గుడ్లను అమ్మకాలను నిషేదించారు.నష్టపోయినవారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని అధికారులు హామి కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube