300 మంది మహిళలతో చికాగాలో 'బతుకమ్మ'     2018-10-12   15:09:39  IST  Surya

అమెరికాలో తెలుగువారు ఎన్నో ప్రాంతాలలో, వివిధ రాష్ట్రాలలో ఉద్యోగ , వ్యాపారాలా రీత్యా కొలువుదీరి ఉంటున్నారు. అక్కడ ఉండే తెలుగువారు తమ తమ సొంత ప్రాంతాలలో నిర్వహించుకునే తెలుగు పండుగలని, పూజలని నిర్వహించుకుంటూ ఉంటారు..అంతేకాదు వీరి సంరక్షణ కోసం ఏర్పాటు కాబడిన తెలుగు సంఘాలు, అందరూ కలిసి కట్టుగా ఎంతో భాద్యతగా చేపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తెలంగాణా రాష్ట్ర ప్రధాన పండుగగా నిర్వహించుకునే

బ్రతుకమ్మ పండుగని సైతం అక్కడ ఉన్న తెలంగాణా ప్రజలు ఏపీ ప్రజలతో కలిసి నిర్వహించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది..ఈ పండుగకి చికాగోలోని అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) వేదిక అయ్యింది ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దాదాపు 300 మంది మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ పండుగకి హాజరయిన స్త్రీలు అందరూ రంగురంగుపూలతో బతుకమ్మలను తయారు చేసి తమ వెంట తీసుకొచ్చి ఆటపాటలతో ఆ ప్రాంతమంతా సందడి చేశారు…కార్యక్రమంలో హనుమంత్‌ రెడ్డి..మెహర్‌ మాదవరం..లక్ష్మీ బోయపల్లి, భాను స్వర్గం..తదితరులు పాల్గొని బతుకమ్మ సంభరాలు ఎంతో ఘనంగా నిర్వహించారు.