చీరల సందడిలో టీఆర్ఎస్ ! ఆడపడుచుల ఆదరణ దక్కేనా ?

ప్రజల నాడి ఎప్పటికప్పుడు పసిగడుతూ తమకు అనుకూలంగా జనాలను తమ వైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరంతరం ప్లాన్లు వేస్తూనే ఉంటారు. టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటివరకు చూసుకుంటే, ఆయన అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాధించి చూపించారు.

 Bathukamma Sarees Expo In Telangana, Trs Government, Free Saree,bathukamma Saree-TeluguStop.com

ప్రస్తుతం తెలంగాణాలో వరుసగా ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, ప్రజల దృష్టి ఏ విధంగా మరల్చాలి అనే అన్ని రకాల ఎత్తుగడలను ఆయన వేస్తూ వస్తున్నారు.తాజాగా తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.

ముఖ్యంగా ఈ వ్యవహారం అంతా మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరుగుతోంది.
గతంలో ఈ చీరల పంపిణీ చేపట్టినా, నాణ్యత లోపం కనిపించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

దీంతో చీరల పంపిణీ చేశారు.అయినా ఆ సంతృప్తి టిఆర్ఎస్ పెద్దలకు దక్కలేదు.

కానీ ఈసారి అటువంటి వ్యవహారాలు ఏవీ చోటుచేసుకోకుండా, ఎటువంటి విమర్శలు రాకుండా, 287 విభిన్నమైన డిజైన్లలో బంగారం, వెండి, జరీ అంచుల తో తయారుచేసిన పాలిస్టర్ పిలిమెంట్ , నూలు చీరలను పంపిణీకి సిద్ధం చేశారు.బతుకమ్మ పండుగ కోసం మహిళలకు ఉచితంగా అందించే ఏర్పాట్లు చేస్తోంది.

Telugu Dasara, Sabithaindra, Siricilla, Trs-Telugu Political News

ఈ చీరల నిమిత్తం సుమారు 317 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టింది.అలాగే ఈ చీరల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ఈ చీరల తయారీకి 20 వేల మంది కార్మికులు, 18000 మరమగ్గాలపై పనిచేశారు.ఈ చీరలు ఎక్కువ శాతం సిరిసిల్ల చేనేత కార్మికుల ద్వారా చేయించడంతో, వారికి పెద్ద ఎత్తున ఉపాధి లభించింది.ఈ క్రెడిట్ అంతా కేటీఆర్ తన ఖాతాలో వేసుకున్నారు.

ఈ చీరలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఆడపడుచులకు వారి ఇళ్లవద్దకే పంపిణీ చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

కేవలం తెలంగాణ రాష్ట్రం కోసమే నేతన్నలు ఈ చీరలు ఉత్పత్తి చేయడం లేదని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చేలాగా వారికి అవకాశం కల్పించామని, ప్రస్తుతం ఉచితంగా పంపిణీ

  • చేస్తున్న ఈ చీరలు బహిరంగ మార్కెట్లో 400 నుంచి 500 వరకు ధర నిర్ణయించినా అమ్ముడుపోతాయి అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

    ఈ చీరల తయారీ ద్వారా పెద్ద ఎత్తున నేతన్నలకు ఉపాధి కల్పించామనే సంతృప్తి ఉన్నట్లు ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఈ చీరలు సెంటిమెంట్ వర్కౌట్ అయితే టీఆర్ఎస్ కు మహిళల ఆదరణ మరింత పెరుగుతుందని ఇదంతా తమకు కలిసి వస్తుందని త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆ ప్రభావం తప్పకుండా కనిపిస్తోందని టిఆర్ఎస్ ప్రభుత్వం  ఆలోచనలో  ఉంది.

  • Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

    తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

    ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
    Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube