బాలీవుడ్ ను వెంటాడుతున్న మరణాలు.. సీనియర్ దర్శకుడు మృతి…  

Basu Chatterjee Bollywood Senior Director - Telugu Basu Chatterjee, Bollywood, Bollywood Senior Director, Death News

గత కొద్ది రోజులుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంభవిస్తున్నటువంటి మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.తాజాగా బాలీవుడ్లో పలు చిత్రాలకు దర్శకుడిగా పని చేసినటువంటి సీనియర్ దర్శకుడు బసు చటర్జీ ఈ రోజు మృతి చెందినట్లు ఆయన సమీప బంధువులు  సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అధికారికంగా తెలియజేశారు.

 Basu Chatterjee Bollywood Senior Director

వివరాల్లోకి వెళితే ఇటీవల బసు చటర్జీ అనారోగ్యం కారణంగా బాధ పడుతూ ఉండేవాడు.దీంతో తాజాగా బసు చటర్జీ కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు.కాగా ఈ మధ్య ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువ కావడం, దీనికి తోడు వయసు పైబడటం తో ఈరోజు మధ్యాహ్నం సమయంలో బసు చటర్జీ మృతి చెందాడు.దీంతో పలువురు సినీ ప్రముఖులు బసు చటర్జీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా 93 సంవత్సరాలు కలిగినటువంటి బసు చటర్జీ తన సినీ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను మరియు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.అంతేకాక అమితాబ్ బచ్చన్, రాజేష్ కన్నా, స్టార్ హీరోతో కలిసి పనిచేసి ఎన్నో హిట్లను కూడా అందుకున్నారు.

బాలీవుడ్ ను వెంటాడుతున్న మరణాలు.. సీనియర్ దర్శకుడు మృతి…-Latest News-Telugu Tollywood Photo Image

నేటి తరం యువ దర్శకులకు మార్గనిర్దేశం చేసేటు వంటి పో సీనియర్ దర్శకుడు మరణించడంతో సినీ ఇండస్ట్రీ కొంతమేర కలత చెందుతోంది.కాగా ఈ గత కొద్దీ రోజుల్లోనే దాదాపుగా 5 మంది సినీ ప్రముఖులు బాలీవుడ్ సినీ ప్రముఖులు మరణించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test