కాలిఫోర్నియాలో హెలికాఫ్టర్ క్రాష్: 9 మంది దుర్మరణం, మృతుల్లో బాస్కెట్‌బాల్ లెజెండ్

కాలిఫోర్నియాలో ఆదివారం ఓ హెలికాఫ్టర్ కుప్పకూలింది.ఈ ప్రమాదంలో బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ బ్రయంట్ సహా తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు.

 Basketball Legend Kobe Bryant Helicopter California-TeluguStop.com

కాలిఫోర్నియాలోని కాలాబాసాస్లో ఒక కొండను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ విభాగం తెలిపింది.బ్రయంట్‌తో పాటు అతని 13 ఏళ్ల కుమార్తె కూడా ప్రమాదంలో మరణించారు.లాస్‌ ఏంజిల్స్ లేకర్స్‌ తరపున ఆయన ఎన్‌బీఏ ఛాంపియన్‌షిప్‌లను ఆయన గెలుచుకున్నారు.

20 ఏళ్లపాటు బాస్కెట్‌బాల్ క్రీడాకారుడిగా ఆ ఆటకే పేరు తెచ్చిన కొబ్ బ్రయంట్, ఆ తర్వాత క్రీడలకు స్వస్తిపలికి ఇన్వెస్టర్‌గా అవతారం ఎత్తాడు.కోబ్ బీన్ బ్రయంట్ అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఆగస్టు 23, 1978లో జన్మించాడు.తండ్రి ఒక ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు, ఆయన 6 సంవత్సరాల వయసులో ఇటలీకి వెళ్లి.

తండ్రి రిటీలో ఒక జట్టుతో ఒప్పందం కుదుర్చుకోవడంతో వీరి కుటుంబం అక్కడే స్థిరపడింది.

ఇటాలియన్ భాషలో ప్రావీణ్యత సంపాదించిన బ్రయంట్ 1991లో అమెరికాకు తిరిగి వచ్చాడు.ఫిలడెల్ఫియా లోయర్ మెరియన్ హైస్కూల్ కోసం హై స్కాలర్‌గా నటించాడు.1996లో తొలిసారి లాస్ఏంజిల్స్ లేకర్స్ తరపున బరిలోకి దిగిన బ్రయంట్… ఎన్‌బీఏ టైటిళ్లతో పాటు ఒలింపిక్స్‌లో రెండు గోల్డ్ మెడల్స్, రెండు ఎన్‌బీఏ ఫైనల్స్ ఎంవీపీలు తన ఖాతాలో వేసుకున్నాడు.రిటైర్‌మెంట్ సమయంలో మొత్తం 33,643 పాయింట్లతో రిటైర్ అయ్యాడు.లేకర్స్ కోసం 8, 24వ నెంబర్ జెర్సీలను బ్రయంట్ ధరించాడు.

Telugu Calinia, Telugu Nri Ups-

రిటైర్మెంట్‌కు చాలా కాలం ముందు నుంచే ఆయన పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చాడు.అతని విజయవంతమైన పెట్టుబడులలో స్పోర్ట్స్ డ్రింక్ మేకర్ అయిన బాడీఆర్మర్‌లో వాటా ఉంది.ఆ తర్వాత 2014లో అతను 6 మిలియన్లను ఇన్వెస్ట్ చేశాడు.2014లో బాడీఆర్మర్‌లోని మెజారిటీ వాటాను కోకాకోలా సొంతం చేసుకునే సమయానికి బ్రయాంట్ వాటా విలువ 200 మిలియన్ డాలర్లు ఉన్నట్లు అంచనా.

Telugu Calinia, Telugu Nri Ups-

2013లో అతను జెయింట్ స్టిబెల్‌తో కలిసి వెంచర్ క్యాపిటల్ సంస్థ బ్రయంట్ స్టిబెల్‌ను స్థాపించాడు.కాగా హెలికాఫ్టర్ కూలిపోయిన ప్రాంతానికి నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అధికారులు చేరుకున్నారు.బ్రయాంట్ అతని కుమార్తతో పాటు ఇతర ప్రయాణీకులు సికోర్స్కీ ఎస్‌-76 బిలో ప్రయాణించారు.ఆదివారం ఉదయం 9.45 గంటలకు హెలికాఫ్టర్ చివరి సారిగా రాడార్‌లో కనిపించింది.ఆ సమయంలో అది భూఉపరితలానికి 1,700 అడుగుల ఎత్తులో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube