మీ ల్యాప్ టాప్ ఎక్కువకాలం నిలవాలంటే ఈ జాగ్రత్తలు చూడండి     2016-12-21   01:01:36  IST  Raghu V

ఒక వస్తువు కొనడం గొప్ప కాదు, దాన్ని కాపాడుకోవడం గొప్ప అంటూ పెద్దవారు సూక్తులు చెబుతారు. అందులో నిజం లేకపోలేదు. ల్యాప్ టాప్ చాలా ఖరీదైన వస్తువు. డెస్క్ టాప్ తో, స్మార్ట్ ఫోన్ తో పోలిస్తే ల్యాప్ టాప్ ఖరీదే ఎక్కువ. అయినా, వాటికి డిమాండ్ కూడా ఎక్కువే. మరి అలాంటి విలువైన వస్తువుని ఎలా కాపాడుకోవాలి మనం!

* ల్యాప్ టాప్ లో పని పూర్తవగానే షట్ డవున్ చేయండి. అలానే స్లీప్ మోడ్ లో రోజంతా ఉంచేయకండి. స్లీప్ మోడ్ ఉంచేస్తే ఊరికే అనవసరపు క్యాచీ ఫైల్స్ జమ అవుతాయి. దాంతో సిస్టమ్ స్లో అవుతుంది.

* ల్యాప్ టాప్ ని నిరంతరం ఛార్జింగ్ లో పెట్టవద్దు. బ్యాటరీ వార్నింగ్ వస్తే తప్ప చార్జింగ్ పెట్టొద్దు. అలాగే బ్యాటరీ ఫుల్ అయ్యాక ప్లగ్ ని అలానే ఉంచేయవద్దు.

* ప్రైమరీ మెమోరిపై ఎక్కువ భారం పడకుండా హార్డ్ డిస్క్ వాడండి. బ్యాక్ అప్ ఫైల్స్ కూడా అందులో స్డోర్ చేసుకోవచ్చు. అలాగే పెద్ద పెద్ద ఫైల్స్ కూడా ల్యాప్ టాప్ మెమోరిలో కాకుండా దాంట్లో భద్రపరచుకోవచ్చు.

* ల్యాప్ టాప్ ని ఏయిర్ ఫ్లో బాగా ఉన్న సర్ఫేస్ పై వాడండి. అలాగే కూల్ టెంపరేచర్ లో. లేదంటే హ్యాంగ్ అవడం, హీటింగ్ ప్రాబ్లెమ్స్ వస్తాయి.

* ఎప్పటికప్పుడు రన్ లోకి వెళ్ళి, %temp% అని సెర్చ్ చేసి, అన్ వాండెడ్ క్యాచీ ఫైల్స్ ని డిలీట్ చేస్తూ ఉండండి. లేదంటే చెత్త అంటెర జమ అయ్యి ల్యాప్ టాప్ స్లోగా పనిచేస్తుంది.

* చెత్త అంటే గుర్తొచ్చింది. బైక్ ని ఎలాగైతే రోజు క్లీన్ చేసుకుంటారో, అలాగే ల్యాప్ టాప్ ని రోజూ క్లీన్ చేసుకోండి.