Basic Things You Need To Know About JioFi

జియో వరాలమీద వరాలు కురిపిస్తోంది.4G మొబైల్స్ ఉన్నవారు ఎంచక్క ఒక సిమ్ తీసుకోని మూడు నెలలపాటు అన్ లిమిటెడ్ 4G డేటా, అన్ లిమిటెడ్ వీడియో కాలింగ్, అన్ లిమిటెడ్ ఎస్సెమ్మెస్ .ఇలా అన్ని పూర్తి ఉచితంగా ఎంజాయ్ చేస్తోంటే, చేతిలో 3G ఫోన్ పెట్టుకోని బాధపడుతున్నారా? కాస్త ఖర్చుపెట్టే ఆలోచనే ఉండాలి కాని, 3G ఫోన్ తో కూడా మీరు జియో నెట్ ని ఎంజాయ్ చేయవచ్చు.

అదేలా అంటే, జియోఫై ద్వారా.

అవును, జియోఫై (JioFi) అనేది రిలయన్స్ ఇస్తున్న ఒక వైర్ లెస్ రూటర్.ఇది మిగితా రూటర్ల కన్నా తక్కువ సైజ్ లో ఉండి, ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళే వెసులుబాటు కలిగి ఉంటుంది.

ఇందులో 2300mAh బ్యాటరీ ఉంటుంది.ఒక్కసారి ఫుల్ ఛార్జ్ పెడితే, 6 గంటలపాటు జియోఫై ని ఉపయోగించుకోవచ్చు.

ఒకసారి 10 వైఫై ఎనేబుల్డ్ డివైజ్ లను దీనికి కెనెక్ట్ చేసుకోని జియో హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులను పొందవచ్చు.2G/3G వైఫై ఎనెబుల్డ్ డివైజ్ లు మై జియో అప్లికేషన్ ని డవున్లోడ్ చేసుకోని జియోఫై ద్వారా HD కాల్స్ చేసుకోవచ్చు.దీని ధర 1999 రూపాయలు.ఆధార్ కార్డ్ లేదా ఇతర ఐడి ఫ్రూఫ్ సబ్మిట్ చేసి, ఏదైనా రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుంచి దీన్ని పొందవచ్చు.రూటర్ తో పాటు ఒక జియో సిమ్ మూడు నెలల ప్రివ్యూ ఆఫర్ తో మీ సొంతం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube