పిరుదల మీద/మధ్య దురదకి కారణాలు  

Basic Reasons For Itchy Butt -

మనిషి కంట్రోల్ చేసుకోలేక సతమతమయ్యే విషయాల్లో ఒకటి దురద చల్లార్చుకోవడం.కాని దరుద గోరులని ఖచ్చితంగా వాడేలా చేస్తుంది.

అంతలా ఇబ్బందిపెడుతుంది.మరీ ముఖ్యంగా అండర్ వియర్ కప్పే శరీరభాగాల్లో దురద చాలా కామన్ విషయం.

పిరుదల మీదమధ్య దురదకి కారణాలు - Basic Reasons For Itchy Butt - -Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

అంటే జననాంగాల దగ్గర మరియు పిరుదుల దగ్గర దురద సర్వ సాధారణంగా ఉంటుంది.కింది భాగంలోనే దురద ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే ఆక్సిజన్ సరిగా ఆడక పోవడం వలన.జననాంగాల దగ్గర దురదకి కారణం లింగ భేదాన్ని బట్టి మారిపోతుంటుంది.కానీ తిరగల వద్ద దురద కు పెద్దగా లింగ భేదం ఉండదు.

కారణాలు ఒకేలా ఉంటాయి.ఆ కారణాలు ఏమిటో చూడండి

* మొదటి కారణం చాలా సింపుల్.

హైజీన్ సరిగా పాటించకపోవడం వలన పిరుదుల మీద దురద వేస్తుంది.అంటే మలవిసర్జన తర్వాత సరిగా శుభ్రం చేసుకోకపోవడం.

ఇలాంటప్పుడు fecal అనే బ్యాక్టీరియా బాగా ఏర్పడి దురదకు కారణం అవుతుంది

* కారం ఎక్కువ ఉండే ఆహారాలు తినడం వలన కూడా దురద వేయవచ్చు.కొంతమంది కారాన్ని హద్దు అదుపులేకుండా తినేస్తుంటారు.

పిరుదల దగ్గర ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి దురదకు ఆస్కారం ఎక్కువ

* వినడానికి ఒళ్లు జలదరించే la ఉన్నా కొంతమందికి Intestine మరియు rectum రక్తంలో రకమైన పురుగులు పెరుగుతుంటాయి.వీటిని threadworms అని అంటారు.

ఇవి చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి.ఇవి పెట్టే గుడ్ల వలన కూడా పిరుదుల మధ్య దురదగా ఉంటుంది.

* వేడిగా ఉండే ప్రదేశాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి.మీరు టైట్ గా ఉండే అండర్ వేర్స్ వాడటం వలన ఆ ప్రదేశమంతా వేడిగా ఉంటుంది.

ఉష్ణోగ్రతలో బ్యాక్టీరియా సులువుగా పెరుగుతుంది.ఆ కారణంతో కూడా దురద పుట్టవచ్చు

* అన్ని కారణాలు బయటనుంచే ఉండవు కదా.రక్తంలో మలినాలు ఎక్కువగా అయిపోయినా ఆ ప్రభావం బయట చర్మం మీద పడుతుంది.అలా కూడా పిరుదల మధ్య, పిరుదుల పైన దురద పుట్టవచ్చు

* మిగతా కారణాలు చెప్పుకోవాలంటే piles వలన, hemorrhoids వలన, సుఖ వ్యాధుల వలన, మలబద్ధకం వలన, పిరుదుల పైన ఏర్పడే మొటిమల వలన, ఎక్కువగా గోకడం వలన కూడా దురద ఇంకా పెరుగుతుంది.

తాజా వార్తలు