పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు చేసే తప్పులు ఇవి  

Basic Mistakes Women Do In Periods -

స్త్రీ శరీరానికి తప్పని ఇబ్బందే పీరియడ్స్.నిజానికి స్త్రీ అస్తిత్వానికి పీరియడ్స్ అవసరమైన, పీరియడ్స్ ని ఇష్టంగా ఏ మహిళా స్వీకరించలేదు.

కాని శరీర నిర్మాణం ప్రకారం తప్పదుగా.

Basic Mistakes Women Do In Periods -Basic Mistakes Women Do In Periods - -Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

చాలామంది స్త్రీలు అవగాహనరాహిత్యం వలన అప్పటికే కష్టంగా ఉన్న పీరియడ్స్ ని కొన్ని తప్పులు చేసి మరింత కష్టంగా మార్చుకుంటారు.

మరి ఆ తప్పులెంటో చూడండి ఓసారి.

* చాలామంది స్త్రీలు పీరియడ్స్ సమయంలో మలబద్దకం, మోషన్స్, కడుపు ఉబ్బటం లేదా కడుపు నొప్పి లాంటి సమస్యలతో ఇబ్బందిపడతారు.

ఈ సమస్యలు వేరైనా ఒకే కారణం వీటి వెనుక ఉండవచ్చు.అదే తిండి ఎగ్గొట్టడం.

అవును ఓ పూట ఆహారం తీసుకోకపోయినా ఇబ్బందే.పీరియడ్స్ లో డైట్ బాగా పాటించాలి.

సమయానికి మంచి ఆహారం తప్పకుండా తీసుకోవాలి.

* రక్తం రంగుని గమనించాలి పీరియడ్స్ లో.రంగులో మార్పులు జరిగితే డాక్టర్ ని మొహమాటం లేకుండా సంప్రదించాలి.అలాగే చూస్తూ ఉండటం తప్పు.

* కొందరు హైజిన్ సరిగా మెయింటేన్ చేయరు.పీరియడ్స్ లో ఉన్నా, నలుగురితో కలిసే ఉండాలి కాబట్టి హైజిన్ బాగా ముఖ్యం.ప్యాడ్స్ ఎప్పటికప్పుడు మార్చుకోవాలి.బయట తిరుగుతున్నప్పుడు వచ్చే ఇబ్బంది పక్కనపెడితే, ప్యాడ్స్ చాలాసేపు ఉంచుకోవడం వలన ఇన్ఫెక్షన్స్ వస్తాయి.

* పీరియడ్స్ లో ఎట్టి పరిస్థితులలోనూ రక్షణ లేని శృంగారం వద్దు.సామాన్యంగా పీరియడ్స్ సమయంలో సుఖవ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువ.కాబట్టి అలాంటి తప్పులు చేయవద్దు.

* ప్రతీసారి మీ పీరియడ్స్ ట్రాక్ చేయడం ముఖ్యం.

చాలామంది ఇక్కడే పెద్ద తప్పు చేస్తారు.ఋతుక్రమం ఎప్పుడు మొదలయ్యింది, ఏ సమయంలో, ఇలాంటి రికార్డ్స్ గుర్తుంచుకోరు.

పీరియడ్స్ సైకిల్ ఓ ట్రాక్ లో ఉంటేనే మీ ఆరోగ్యం ట్రాక్ లో ఉన్నట్లు.

* అతిగా విశ్రాంతి తీసుకోవడం కూడా తప్పే.

విశ్రాంతి తీసుకోవాల్సిందే కాని శరీరం కదులుతూ ఉండాలి కూడా.లేదంటే క్రామ్ప్స్ ఇంకా ఎక్కువ అవుతాయి.

* ఇక పీరియడ్స్ సమయంలో మహిళలు మద్యం ముట్టకపోతేనే మంచిది.పోరపాటులో ఆ తప్పు చేసారో, క్రామ్ప్స్ మరింత ఎక్కువ అవుతాయి.

తాజా వార్తలు