ఐఐటీ బ్రదర్స్‌ : కాళ్లు లేని అన్నను ఐఐటీ వరకు చేర్చిన తమ్ముడు  

Basanth His Polio-stricken Brother On His Shoulder Everyday For Study-first Time First Class Tenth Pass

కాళ్లు చేతులు అన్నీ సరిగా ఉన్నా కూడా పని చేసేందుకు బద్దకం, కష్టపడేందుకు బద్దకం చూపిస్తూ ఉంటారు.కాని కొందరు మాత్రం తాము అనుకున్న పని సాధించాలనుకునే క్రమంలో వారు అంగవైకల్యంతో బాధపడుతున్నా లేదంటే మరే సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నా కూడా ఆ లక్ష్యంను మాత్రమే చూస్తారు.

Basanth His Polio-stricken Brother On His Shoulder Everyday For Study-first Time First Class Tenth Pass-Basanth His Polio-stricken Brother On Shoulder Everyday For Study-First Time First Class Tenth Pass

అలా లక్ష్యంను చూసిన వారు మాత్రమే అద్బుతమైన ప్రయోజనాలను, ఫలితాలను పొందుతారు.బీహార్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఐఐటీలో స్థానం సంపాదించేందుకు పడ్డ కష్టం అందరికి ఆదర్శనీయం.అందరు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ సక్సెస్‌ స్టోరీని మీ ముందుకు తీసుకు వచ్చాను.

Basanth His Polio-stricken Brother On His Shoulder Everyday For Study-first Time First Class Tenth Pass-Basanth His Polio-stricken Brother On Shoulder Everyday For Study-First Time First Class Tenth Pass

పూర్తి వివరాల్లోకి వెళ్లే ఇండియాలో బాగా వెనుకబడిన రాష్ట్రాల్లో బీహార్‌ ఒకటి.ఆ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం కూడా చాలా తక్కువ.అయినా కూడా కృష్ణ మరియు బసంత్‌లు కష్టపడి చదివి ఐఐటీ లో సీటు దక్కించుకున్నారు.సాదారణంగా నిరుపేద ఇంటికి చెందిన అబ్బాయి ఐఐటీ సాధిస్తే గొప్ప విషయమే.కాని కృష్ణ మరియు బసంత్‌లు ఐఐటీలో స్థానం దక్కించుకోవడం అంతకు మించిన గొప్ప విషయం.

ఎందుకంటే ఈ ఇద్దరిలో అన్న అయిన కృష్ణకు చిన్నప్పుడే రెండు కాళ్లు పోలియో కారణంగా పని చేయకుండా అయ్యాయి.

బసంత్‌ స్కూల్‌కు వెళ్తూ వస్తూ ఉన్న సమయంలో కృష్ణ కూడా తనకు చదువుకోవాలని ఉందని అన్నాడు.అప్పుడు బసంత్‌ తన అన్నను ప్రతి రోజు స్కూల్‌కు తీసుకు వెళ్లడం మొదలు పెట్టాడు.

చిన్నప్పటి నుండి కూడా ఇద్దరు ఒకే క్లాస్‌ చదువుతూ వచ్చారు.అన్నయ్య కృష్ణను ప్రతి రోజు బుజాలమీద ఎక్కించుకుని తీసుకు వచ్చి స్కూల్‌ నుండి మళ్లీ ఇంటికి వెళ్లే వాడు.అంత చిన్న వయసులోనే అన్నయ్యపై ప్రేమతో అతడు చేసిన సాహసం చిన్నది కాదని చెప్పాలి.

అప్పట్లోనే అతడిని అంతా అభినందించేవారు.

అన్నయ్య చదువుకోవాలని కోరికతో ఉంటే నేను అతడికి సాయం చేశాను.నాది పెద్ద పనేం కాదు అంటూ బసంత్‌ అనేవాడు.ఇద్దరు కూడా టెన్త్‌లో ఫస్ట్‌క్లాస్‌లో పాస్‌ అయ్యారు.ఇద్దరు మళ్లీ ఒకే కాలేజ్‌, ఒకే గ్రూప్‌లో జాయిన్‌ అయ్యారు.కాలేజ్‌ నుండి ఇంటికి మరియు ఇంటి నుండి కాలేజ్‌కు కూడా కృష్ణను బసంత్‌ మోసుకుంటూ వెళ్లే వాడు.ఇద్దరు కూడా చదువు విషయంలో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండే వారు.కృష్ణ చాలా తెలివైన కుర్రాడు.చదువుపై చాలా ఇష్టంతో ఎక్కువ కష్టపడేవాడు.బసంత్‌కు వచ్చిన డౌట్స్‌ను క్లియర్‌ చేయడంతో పాటు ఇద్దరు సబ్జెక్ట్‌ను చర్చించుకునే వారు.

వారిద్దరు చాలా కష్టపడి చదివి ఐఐటీ ఎంట్రెన్స్‌ రాశారు.అదృష్టం కొద్ది ఇద్దరికి సీటు దక్కింది.అయితే కృష్ణకు మంచి ర్యాంకు రాగా బసంత్‌కు మాత్రం కాస్త ఎక్కువ ర్యాంకు వచ్చింది.దాంతో ఐఐటీ ఇద్దరు వేరు వేరు చోట్ల చేయాల్సి వచ్చింది.అయినా కూడా అన్నయ్య కృష్ణను కాలేజ్‌లో దించిన తర్వాత బసంత్‌ తను కాలేజ్‌కు వెళ్లేవాడు.

ప్రస్తుతం ఇద్దరు కూడా ప్రముఖ కంపెనీలో మంచి పొజీషన్‌లో ఉద్యోగం చేస్తున్నారు.తమ్ముడి సాయంతో కృష్ణ సాధించిన విజయాలు అందరికి ఆదర్శం.ఎలాంటి అంగవైకల్యం ఉన్నా ఇతరుల సాయంతో దాన్ని జయించి విజయాన్ని సాధించవచ్చు అని కృష్ణను చూసి నేర్చుకోవాలి.