కాలేజీల్లో అమ్మాయిల‌కు, అబ్బాయిల‌కు మ‌ధ్య ప‌ర‌దాలు.. తాలిబ‌న్ల దాష్టీకం

ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి ఆప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు తమ వశం చేసుకున్న సంగతి అందరికీ విదితమే.ఇక ఆ దేశం నుంచి ఇప్పటికే చాలా మంది పారిపోయారు.

 Barriers Between Girls And Boys In Colleges Taliban Aggression, Taliban, Afghani-TeluguStop.com

కాగా, ప్రజెంట్ ఆప్ఘన్‌లో ఉన్న మహిళలు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే ఆప్ఘన్‌లో తాలిబన్ల పాలనకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగవైరలవుతోంది.

అదేంటంటే.ఆప్ఘనిస్తాన్‌లో కొన్ని ప్రావిన్స్‌లలో ఇటీవల యూనివర్సిటీస్ ఓపెన్ చేశారు.

ఈ క్రమంలోనే యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఒకరినొకరు చూసుకోకుండా ఉండేందుకుగాను తాలిబన్లు తరగతి గదుల్లో పరదాలు ఏర్పాటు చేశారు.దీనిని ఒకరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఇక ఆ ఫొటోను చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.ఈ ఫొటోను చూసి మహిళలపై తాలిబన్లకు ఉన్న గౌరవం తెలిసిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

మరికొందరు నెటిజన్లు అయితే మహిళలకు ఆప్ఘనిస్తాన్‌లో ఇక భద్రత ఉండబోదని అంటున్నారు.తాలిబన్లు ఓ వైపు మహిళల హక్కులు గౌరవిస్తామని చెప్తూనే మరో వైపున మహిళల హక్కులకు భంగం కలిగిస్తున్నారు.

తాలిబన్ ఎడ్యుకేషన్ అథారిటీ విద్యాసంస్థలకు ఇటీవల కొన్ని అభ్యంతరకర ఆదేశాలను జారీ చేసింది.

Telugu Afghanisthan, Curtains, Systrm, Taliban, Talibans-Latest News - Telugu

ప్రైవేటు యూనివర్సిటీలకు వెళ్లే మహిళలు తప్పనిసరిగా బుర్ఖా ధరించాలని, వేర్వేరు క్లాస్ రూమ్స్‌లో అమ్మాయిలు, అబ్బాయిలకు పాఠాలు చెప్పాలన్నారు.అమ్మాయిలకు పురుషులు విద్యాబోధన చేయరాదని చెప్పారు.ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వయసులో పెద్దవారైన మేల్ టీచర్స్ మాత్రమే పాఠాలు చెప్పాలని పేర్కొన్నారు.

క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు ఒకేసారి బయటకు వెళ్లొద్దట.ఇలా మహిళల హక్కులను కాలరాసే అభ్యంతరకర ఆదేశాలను తాలిబన్లు అమలు చేస్తున్నారు.తాలిబన్లకు వ్యతిరేకంగా ఎవరైనా నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube