సోషల్ మీడియా( Social media ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న బర్రెలక్క శిరీష పెళ్లైన వారానికే సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.వెంకటేశ్( Venkatesh ) అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న శిరీష నేటి తరం అమ్మాయిల గురించి అమ్మాయిలు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
బర్రెలక్క ఆ పోస్ట్ లో ఒక అమ్మాయికి గాయమైతే గాయం చేసిన వాళ్లను ఏమీ అనరు కానీ గాయపడ్డ వారిని మాత్రం మాటలతో చంపుతారని పేర్కొన్నారు.అమ్మాయి ధైర్యంగా బయట నడవటానికి కూడా ఉండదని ఆమె చెప్పుకొచ్చారు.
మంచోళ్లు ఉన్నారని చెడ్డోళ్లు ఉన్నారని ప్రతి అమ్మాయిలో తన అమ్మను చూస్తే తప్పు చేయాలనే ఆలోచన కూడా రాదని బర్రెలక్క శిరీష( Barrelakka Shirisha ) వెల్లడించడం గమనార్హం.
ఒక అమ్మాయి ఇలా మూసుకుని దాక్కునే పరిస్థితి రాదని ఆమె చెప్పుకొచ్చారు.తప్పు చేసిన వాళ్లు బయట బాగానే ఉన్నారని ఏ తప్పు చేయని వాళ్లు బాధ పడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు.పెళ్లి తర్వాత శిరీష నుంచి ఇలాంటి పోస్ట్ ఊహించలేదని శిరీష ఏం జరిగిందో చెప్పాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
శిరీష పోస్ట్ వెనుక పరమార్థం తెలియాలంటే ఆమె స్పందించే వరకు ఆగాల్సిందే.
బర్రెలక్క శిరీష సంతోషంగా జీవనం సాగించాలని అమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బర్రెలక్క శిరీష ఇప్పటినుంచి రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే ఎప్పటికైనా ఆమెకు అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.బర్రెలక్క శిరీష కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.
శిరీష ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను మాత్రం అంతకంతకూ పెంచుకుంటున్నారు.