ఓ కమల కథ... 10వ తరగతి పూర్తి చేసి చరిత్ర సృష్టించి, అందరికి ఆదర్శంగా నిలిచింది

మూడు నాలుగు దశాబ్దాల క్రితం అమ్మాయిల చదువుపై ఇండియాలో పెద్దగా శ్రద్ద పెట్టే వారు కాదు.కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.

 Barmer Village Girl Kamla Makes Class X History-TeluguStop.com

అబ్బాయిలకు పోటీగా, ధీటుగా అమ్మాయిలు చదువుతున్నారు.పల్లెటూర్లలో కూడా అమ్మాయిలు స్కూల్‌కు వెళ్తూ దేశ పురోగభివృద్దికి అద్దం పడుతున్నారు.

అమ్మాయి చదువు అవనికి మంచిది అని పెద్దలు అంటారు.అందుకే అమ్మాయిలు చదువుకుంటున్న ఈ సమయంలో అభివృద్దిలో దూసుకు పోతున్నాం.

అన్ని రంగాల్లో కూడా అమ్మాయిలు చూపిస్తున్న ప్రతిభ నిజంగా అభినందనీయం.అయితే దేశ వ్యాప్తంగా పరిస్థితి ఒకలా ఉంటే పాకిస్థాన్‌ బోర్డర్‌ సమీపంలో ఉండే బార్మర్‌ గ్రామానిది ఒక పరిస్థితి.

అక్కడ అమ్మాయిలు చదువుకోవడం జరగలేదు.ఇప్పటి వరకు 10వ తరగతి పూర్తి చేసిన అమ్మాయి లేరు.

ఎట్టకేలకు కమల చరిత్రను సృష్టించింది.

కమల కథ విషయానికి వెళ్తే… రాజస్థాన్‌లోని భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దులో ఉండే రిమోట్‌ ఏరియాలో చిన్న గ్రామం అయిన బార్మర్‌లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది.ఆ ప్రాంతంలో అక్షరాస్యత కేవలం 20 శాతం మాత్రమే.ఇక అమ్మాయిల అక్షరాస్యత రెండు మూడు శాతం మాత్రమే అంటే నమ్మక తప్పదు.

ఆ రెండు మూడు శాతం అమ్మాయిలు కూడా అయిదు లోపు చదువు ఉన్న వారే.అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్న ఆ గ్రామం నుండి కమల 16వ ఏట పదవతరగతి పాస్‌ అయ్యింది.

కమల చదువుకునేందుకు చిన్నప్పటి నుండి కూడా రోజు 7 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ప్రాంతం వెంబడి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించేది.

ఆమె ప్రయాణంలో అడుగడుగున ప్రమాదం ఉందని తెలిసినా కూడా చదువుపై ఉన్న మక్కువతో ఆమె స్కూల్‌కు వెళ్లింది.కమలను చూసిన ఆ గ్రామానికి చెందిన మరి కొందరు అమ్మాయిలు ఇప్పుడు స్కూల్‌కు వెళ్తున్నారు.ఆ ఊరు నుండి ప్రస్తుతం 10 మంది అమ్మాయిలు మరియు ఇంకా చాలా మంది అబ్బాయిలు స్కూల్‌కు వెళ్తున్నారు.

ఎంత మందికి ఆదర్శంగా నిలిచిన కమల మాట్లాడుతూ.తాను ఒక్కదాన్నే స్కూల్‌కు వెళ్లేదాన్ని, అంత దూరం ప్రయాణించడం చాలా ఇబ్బందిగా అనిపించేది.ఆ సమయంలో నాకు ఇండియన్‌ ఆర్మీ వారు చాలా సాయంగా నిలిచారు.వారు ప్రతి రోజు నాకు నా సహకారం అందించారు అంటూ చెప్పుకొచ్చింది.

ఊర్లో కనీస అవసరాలు కూడా ఉండని ప్రాంతం అది, అలాంటి ఊరును ప్రభుత్వాలు పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.స్కూల్‌ వంటి వసతి లేకున్నా కనీసం తాగడానికి నీరు అయినా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని కమల కోరంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube