'ఆదర్శ కోడలు' కోర్సు ప్రవేశ పెట్టనున్న భోపాల్ యూనివర్సిటీ...ఆదర్శ అల్లుడు కోర్సు ప్రవేశపెట్టమని నెటిజన్ల సెటైర్లు..

అత్తవారింట్లోకి అడుగు పెట్టడానికి ముందే ఆ ఆడపిల్లకు ఏ ఏ లక్షణాలు ఉండాలో ముందుగానే నేర్పుతుంటారు ఆ కాలేజిలో… అమెరికాలో ఉండే కాబోయే వరుడికి నచ్చే విధంగా మారడం కోసం హీరోయిన్ కూడా అక్కడే జాయిన్ పాటలు,డ్యాన్స్,ఇంగ్లీషు ఇలా అన్ని నేర్చుకుంటుంది.సినిమా పేరు పల్లకిలో పెళ్లి కూతురు…సేమ్ ఇదే తరహాలో ఒక కోర్సు స్టార్ట్ చేస్తున్నారు భోపాల్ లోని బర్కాతుల్లా యూనిర్సిటీ… వాళ్లు నేర్పించే కోర్సు పేరేంటంటే ఆదర్శ్ బహూ(ఆదర్శవంతమైన కోడలు).ఇంతకీ ఆ కోర్సులో ఏం నేర్పుతారంటే…

 Barkatullah University Is Planning On Adarsh Bahu Certificate Course-TeluguStop.com

పెళ్లయ్యాక భర్త పట్ల, అత్తామామల పట్ల బాధ్యతగా ఎలా ఉండాలి?, ఎలా నడుచుకోవాలి?.లాంటి విషయాలు నేర్పిస్తారట.కాగా, మహిళా సాధికారతను పెంపొందించేందుకే ఈ కోర్సును ప్రవేశ పెడుతున్నట్లు వర్సిటీ యాజమాన్యం వెల్లడించింది.2019 నుంచి ఈ ఆదర్శ్ బాహు కోర్సును ప్రారంభించనున్నట్లు ,మూడు నెలలపాటు శిక్షణా తరగతులు ఉంటాయని వెల్లడించింది.పెళ్లయ్యాక కొత్త జీవితం సాఫీగా సాగిపోయేందుకు ఈ కోర్సు సహాయపడుతుందని పేర్కొంది.‘వివాహమైన తర్వాత అమ్మాయి జీవితంలో కొత్త దశ మొదలవుతుంది.ఆ వాతావరణంలో చోటు చేసుకునే మార్పులకు ఆడపిల్లలు త్వరగా అలవాటు పడలేరు.అందుకోసమే ఈ కోర్సును ప్రవేశపెట్టాం.

మా వర్సిటీకి సమాజం పట్ల బాధ్యత కూడా ఉంది.కేవలం చదువు విషయంలోనే కాదు ఆడ పిల్లల కోసం ఇలాంటి కోర్సులు పెడితే కాపురాల్లో ఎలాంటి కలహాలు చోటు చేసుకోకుండా ఉంటాయన్నది తమ అభిప్రాయం’ అని బర్కతుల్లా వర్సిటీ వైస్ ఛాన్సలర్ డీసీ గుప్తా పేర్కొన్నారు.

తొలి విడతలో 30మంది విద్యార్థినులను చేర్చుకోబోతున్నట్లు తెలిపారు.అయితే, వర్సిటీ ఈ కోర్సును ప్రవేశపెట్టడంపై కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.అబ్బాయిల కోసం కూడా ఆదర్శవంతమైన అల్లుడు అనే కోర్సు కూడా ప్రవేశపెడితే బాగుంటుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు…అంతేకాదు ఇన్నాళ్లు మన అమ్మలు,అమ్మమ్మలు ఏం కోర్సులు నేర్చుకుని మనల్ని,కుటుంబాన్ని చూసుకున్నారని విమర్శిస్తున్నారు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube