భర్తని చోరీ కేసులో ఇరికించి... భార్యపై స్నేహితుల అత్యాచారం  

Bareilly Woman Gang-raped By Husband\'s Friends-husband\\'s Friends,uttara Pradesh,women Harassment Disha Act

ఈ మధ్య కాలంలో మహిళలపై తరుచుగా జరుగుతున్నా అత్యాచారాలు భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి.ఒంటరిగా ఆడవాళ్ళు బయటకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి.అలాగే ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళపై కూడా కన్నేసి కిరాతకులు అత్యాచారాలకి ఒడిగడుతున్నారు.తరువాత కిరాతకంగా చంపేసే ప్రయత్నం చేస్తున్నారు.ఇలాంటి ఘటనలలో చట్టాలు కఠిన శిక్షలు వేసిన కూడా వీటిని మాత్రం నియంత్రించలేకపోతున్నారు.తాజాగా ఉత్తరప్రదేశ్ మరో ఘోరం వెలుగు చూసింది.సినిమా తరహలో తాము కన్నేసిన మహిళని అనుభవించాలని భావించిన కొంత మంది కుర్రాళ్ళు ఆమె భర్తని ఓ చోరీ కేసులో ఇరికించి తరువాత కిరాతకంగా గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు.ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.

Bareilly Woman Gang-Raped By Husband's Friends-Husband\\'s Friends Uttara Pradesh Women Harassment Disha Act

ఉత్తరప్రదేశ్ లో బరేలీ జిల్లా సిరౌలీ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు.ఆ మహిళా అందంగా ఉండటంతో గ్రామంలో ఆవారాగా తిరిగే కొందరు యువకులు కన్నేశారు.

ఆమె భర్త ఉన్నప్పుడు తమ పని సాగదని గ్రహించి పక్కా ప్లాన్ తో అతడ్ని దొంగతనం కేసులో ఇరికించారు.దీంతో పోలీసులు అతనిని జైల్లో పెట్టారు.ఇదే అవకాశంగా భావించిన ఆ యువకులు మహిళా ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారు.తరువాత ఈ విషయం బయటపడుతుందని.ఆమె గొంతు కోసి చంపే ప్రయత్నం చేశారు.అయితే వారి నుంచి తప్పించుకొని బయటపడిన ఆమె ఇరుగుపొరుగు వారిని పిలిచింది.

ఆమెని స్థానికులు హాస్పిటల్ కి తరలించారు.అత్యాచారం చేసిన నలుగురు యువకులు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు.

అత్యాచారం చేసిన నిందితులు యువైస్, నాజుక్ బేగ్, రియాసత్ బేగ్, అఫ్జల్ గా గుర్తించారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

.

తాజా వార్తలు

Bareilly Woman Gang-raped By Husband\'s Friends-husband\\'s Friends,uttara Pradesh,women Harassment Disha Act Related....