ఒబామా కి తెగ నచ్చేసిన సినిమాలు ఇవేనట

సినిమాలు చూడని వారు, ఇష్టపడని వారు బహుశా ఎవరూ ఉండరు.సినిమాలు ఎంతో వినోదాన్ని పంచుతాయి.

 Barack Obama Shares His Favorite Movies And Tv Shows Of 2019-TeluguStop.com

మరికొన్ని ఆలోచింప చేస్తాయి.అయితే ఎప్పుడు బిజీ బిజీగా ఉండే వాళ్ళు సినిమాలు చూసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

అలాంటి వాళ్ళు సంవసత్సరానికి రెండు సినిమా చూశారంటే గొప్పే.మరి అలాంటిది అమెరికా వంటి దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించి ప్రస్తుతం మాజీ అధ్యక్షుడు అయిన ఒబామా ఇంకెంత బిజీగా ఉంటారు.

కానీ ఆయనకి ఉన్న సినిమాల పిచ్చి అంతా ఇంతా కాదు ఈ ఏడాది నాకు నచ్చిన సినిమాలు ఇవే అంటూ ఆయన ఓ లిస్టు కూడా ప్రకటించాడు.

ఒబామా గురించి తెలియని విషయం ఏమిటంటే.

సినిమాలంటే ఆయనకి పిచ్చి మత్ర్రమే కాదు ఓ ప్రోఫిషన్ కూడా.అందుకే ఏకంగా ఓ ప్రొడక్షన్ కంపెనీ కూడా పెట్టారు.

నెట్ ఫ్లిక్స్ తో కలిసి ఆయన పలు వెబ్ సీరీస్ కూడా నిర్మిస్తున్నారు.తాజాగా ఇవే నాకు నచ్చిన సినిమాలంటూ ఇచ్చిన లిస్టు లో ఆయన నిర్మించిన అమెరికన్ ఫ్యాక్టరీ కూడా ఉంది.

అంతేకాదు తాజాగా ఆస్కార్ కి షార్ట్ లిస్టు అయిన హయ్యర్ గ్రౌండ్ చిత్రం కూడా ఈ జాబితాలో ఉంది.

Telugu Barack Obama-

అమెరికన్ ఫ్యాక్టరీ ,బుక్ స్మార్ట్, జస్ట్ మెర్సీ ట్రాన్సిట్, ది ఐరిష్ మ్యాన్ వంటి పలు చిత్రాలు నాకు ఎంతో నచ్చాయి.సినిమాలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి.ఎంతో సంతోషపరుస్తాయి అంటూ ఒబామా కొటేషన్లు కూడా పెట్టారు.

ఏది ఏమైనా సరైన ప్లానింగ్ ఉంటే ఎంతటి బిజీ మనిషి అయినా కొంత సమయం ఎంటర్టైన్మెంట్ కి వెచ్చిస్తే ఆరోగ్యం , సంతోషం దగ్గరగా ఉంటాయని అంటున్నారు ఈ మాజీ అధ్యక్షుడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube