బిడెన్ కోసం ఎంత కష్టపడుతున్నావయ్యా ఒబామా…!!!  

Former President Barack Obama shares phone number, Barack Obama , Joe Biden, democratic Party leaders, America elections - Telugu America Elections, Barack Obama, Democratic Party Leaders, Former President Barack Obama Shares Phone Number, Joe Biden

అమెరికా అధ్యక్షడిగా బిడెన్ ను గెలిపించడానికి డెమోక్రటిక్ పార్టీ నేతలు అందరూ గడిచిన కొంత కాలంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ పార్టీ మాజీ అధ్యక్షు, కీలక నేతలు అందరూ బిడెన్ గెలుపుకోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.

TeluguStop.com - Barack Obama Phone Number Joe Biden Elections

ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు ఒబామా బిడెన్ గెలుపుని తన భుజాలపై వేసుకున్నారు.సమయం దొరికనప్పుడల్లా బిడెన్ కి ఓటు వేయండి అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.

అక్కడితో ఆగకుండా ఏకంగా తన ఫోన్ నెంబర్ ఇచ్చి మరీ అమెరికన్స్ గా మీరు అద్యక్షుడిగా ఎవరిని కోరుకుంటున్నారు అంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

TeluguStop.com - బిడెన్ కోసం ఎంత కష్టపడుతున్నావయ్యా ఒబామా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బిడెన్ ని గెలిపించుకునేందుకు అభిమానులు, కార్యకర్తలు, పౌరులకు తన ఫోన్ నెంబర్ ఇచ్చి మీ అభిప్రాయాలను తెలియజేయండి, మీ సందేహాలను నివృత్తి చేస్తాను అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.773-365-9687 నెంబర్ ఇచ్చి మీరు ఎలాంటి రాజకీయాలు కోరుకుంటున్నారు, ఎలా ఓటు వేయాలని అనుకుంటున్నారు, మనం ఈ విషయాలు చర్చిద్దాం మీ అభిప్రాయాలు చెప్పండంటూ సందేశం ఇచ్చారు.

అసలు అమెరికన్స్ అందరూ ఎలా ఓటు వేయాలని అనుకుంటున్నారు, మీకు ఏ విధానం ఇష్టమో చెప్పండి అనే ప్రశ్నలను ఒబామా తరుచుగా సందిస్తున్నారు.

మీరు ఎలాంటి నిర్ణయం చెప్పినా లేక నన్ను ఎలాంటి సందేహాలు అడిగినా వెంటనే స్పందిస్తానని అన్నారు.ఒబామా ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆయన స్వస్థలమైన చికాగోకి చెందినది కావడంతో నిజంగానే ఆయన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఒబామా ఇచ్చారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఒబామా చేపట్టిన ఈ కార్యక్రమం వెనుక బిడెన్ కి అమెరికన్స్ మద్దతు భారీగా కూడబెట్టడానికేనని స్పష్టమవుతోందని అంటున్నారు పరిశీలకులు.

#FormerPresident #Joe Biden #Barack Obama #DemocraticParty

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Barack Obama Phone Number Joe Biden Elections Related Telugu News,Photos/Pics,Images..