అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. ఒబామా రికార్డుల వరద..!!!  

Barack obama biography book a promised Land creates new record, Obama, Obama Biography, A promised Land, Biden, Kamala Harries, Obama book record - Telugu A Promised Land, Biden, Kamala Harries, Obama Biography, Obama Book Record

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.కేవలం అధ్యక్షుడిగా మాత్రమే కాదు మంచి రాజకీయవేత్తగా, బిజినెస్ మ్యాన్ గా, రచయితగా, పేరు తెచ్చుకున్నారు.

TeluguStop.com - Barack Obama Biography Book A Promised Land Creates New Record

తాజాగా ఆయన రాసిన “ ఏ ప్రామిస్డ్ ల్యాండ్ ” పుస్తకం ప్రస్తుతం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.బహుశా ఒబామా కూడా ఊహించి ఉండరేమో అనుకునేలా ఈ పుస్తకం విడుదల అయిన 24 గంటలలో 8.9 లక్షల ప్రతులు అమ్ముడు పోయింది.అమెరికా చరిత్రలోనే బెస్ట్ సెల్లింగ్ పుస్తకంగా నిలవడానికి సిద్దంగా ఉందట.

ఒబామా రాసిన ఈ పుస్తకానికి పెంగ్విన్ రాండమ్ హౌస్ విడుదల భాద్యతలు తీసుకుంది.విడుదల కాకముందే ఈ పుస్తకంలో ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయో బయటకి చెప్పడంతో ఈ పుస్తకం పై డిమాండ్ పెరిగిపోయింది.

TeluguStop.com - అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. ఒబామా రికార్డుల వరద..-General-Telugu-Telugu Tollywood Photo Image

దాంతో ఒక్కసారిగా లక్షల కాపీలు అమ్ముడు పోయాయని నిర్వాహకులు తెలిపారు.ఇదిలాఉంటే ఒబామా రికార్డులకు చేరువలో మరో పుస్తకం కూడా ఉంది.అదే “బికమికంగ్” ఈ పుస్తకాన్ని రచించింది ఎవరో కాదు ఒబామా సతీమణి మిచెల్ ఒబామా.

అయితే ఒబామా రాసిన ఈ పుస్తకం ప్రస్తుతం ప్రఖ్యాత ఈ కామర్స్ సైట్లలో ప్రధమ స్థానంలో ఉండటం గమనార్హం.అంతేకాదు

అమ్మకాలు మరింతగా పెరిగిపోయే అవకాశం ఉందని, ఈ పుస్తకం కేవలం 10 రోజుల్లో భారీ రికార్డులు క్రియేట్ చేస్తుందని అంటున్నారు నిపుణులు.ఇదిలాఉంటే గతంలో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ “మై లైఫ్” మరో మాజీ అధ్యక్షుడు బుష్ రచించిన డెసిషన్ పాయింట్స్ పుస్తకాలు 4 లక్షల లోపు}} కాపీలు అమ్ముడు పోగా ఎన్నడూ లేనంతగా ఒబామా రాసిన పుస్తకం 8 లక్షల పై చీలుకు కాపీలు అమ్ముడు పోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మరి భవిష్యత్తులో ఈ పుస్తకం ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

#A Promised Land #Biden #Kamala Harries #Obama Biography

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Barack Obama Biography Book A Promised Land Creates New Record Related Telugu News,Photos/Pics,Images..