మన ఇంజినీర్ కి అమెరిక లో గొప్ప ఖ్యాతి

ఓ ఇంజనీరుగా అమెరికాకు వెళ్లి, అక్కడి సిక్కుల సమస్యలను పరిష్కరించాలన్న సదుద్దేశంతో వారి హక్కులను కాపాడేలా ఓ సంస్థను ప్రారంభించిన మంజీత్ సింగ్ అనే భారత యువకుడికి అరుదైన గౌరవం లభించింది.ఒబామా పాలనలో ముఖ్యమైన సలహా కమిటీలో మంజీత్ కు స్థానం లభించింది.

 Barack Obama Appoints Indian-american To Key Administration Post-TeluguStop.com

తనకు సలహాదారుడిగా ఆయన్ను నియమిస్తూ, ఒబామా ఉత్తర్వులు జారీ చేశారు.విదేశాలతో అమెరికా సంబంధాలను మెరుగుపరిచే దిశగా మరింతగా కృషి చేయాలని, తనకు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఒబామా సూచించారు.కాగా, యూనివర్శిటీ ఆఫ్ బాంబేలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మంజీత్, న్యూయార్క్ నుంచి మాస్టర్ సైన్స్ పట్టాను పొందారు.

2013లో యూఎస్ లో సాఫ్ట్ వేర్ సంస్థను స్వయంగా ప్రారంభించారు.గురుగోవింద్ సింగ్ ఫౌండేషన్ లో సభ్యుడిగా ఉండి ఇండియా నుంచి యూఎస్ వెళ్లే సిక్కులకు సహాయపడ్డారు.ఇప్పుడు ఆయన సేవలకు ఘనమైన గుర్తింపు లభించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube