ఆలస్యంగా వచ్చిన వరుడు.. వేరే యువకుడితో పెళ్లి  

Baraat Arrives Late Gets Locked Up Bride Finds Herself New-telugu Viral News Updates,viral In Social Media,ఆలస్యంగా వచ్చిన వరుడు,వేరే యువకుడితో పెళ్లి

తన పెళ్లికి తనే ఆలస్యమయ్యాడు ఆపై ఫలితం అనుభవించాడు.లేటుగా రావడంతో పెళ్లికొడుకు కాస్తా పెళ్లి పెద్దగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Baraat Arrives Late Gets Locked Up Bride Finds Herself New-telugu Viral News Updates,viral In Social Media,ఆలస్యంగా వచ్చిన వరుడు,వేరే యువకుడితో పెళ్లి Telugu Viral News-Baraat Arrives Late Gets Locked Up Bride Finds Herself New-Telugu Viral News Updates Viral In Social Media ఆలస్యంగా వచ్చిన వరుడు వేరే యువకుడితో పెళ్లి

తన ప్లేస్‌లో వేరే వ్యక్తి వరుడుగా మారిపోయాడు.ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.

పెళ్లి బరాత్ ఆలస్యం కావడంతో వరుడు పెళ్లికి రావాల్సిన సమయంలో రాలేకపోయాడు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఈ పరిణామంతో వధువు కుటుంబ సభ్యులు ఆమెను మరొక యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు.

దీంతో భంగపడిన వరుడు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.

ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగింది.

నిజానికి బిజ్నూర్‌లోని నంగల్‌జాట్‌ గ్రామానికి చెందిన ఓ యువతికి సామూహిక వివాహ వేడుకల్లో భాగంగా అక్టోబర్‌లో ఓ యువకుడితో పెళ్లి జరిగింది.అయితే వారి పెద్దలు మళ్లీ ఒక్కసారి వారికి పెళ్లి చేయాలని నిర్ణయించారు.

ఈ డిసెంబరు 4న పెళ్లి పెట్టుకున్నారు.అయితే పెళ్లి కోసం ధంపూర్‌ పట్టణానికి చెందిన వరుడు బిజ్నూర్‌కు బయల్దేరాడు.

అయితే మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్లాల్సిన పెళ్లికొడుకు.రాత్రికి చేరుకున్నాడు.

ఈ పరిణామంతో ఇరు వర్గాలు గొడవకు దిగారు.వధువు బంధువులు వరుడి తరపువాళ్లను ఓ గదిలో బంధించారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాళ్లను విడిపించారు.ఈ క్రమంలో ఇరువర్గాలు పోలీసుల సమక్షంలో రాజీకి వచ్చాయి.

అయితే వధువు మాత్రం వరుడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది.దీంతో వధువు కోరుకున్న యువకుడితో పెళ్లి జరిపించారు.

.

తాజా వార్తలు

Baraat Arrives Late Gets Locked Up Bride Finds Herself New-telugu Viral News Updates,viral In Social Media,ఆలస్యంగా వచ్చిన వరుడు,వేరే యువకుడితో పెళ్లి Related....