క్లబ్ డ్యాన్సర్ పై వికృత చేష్టలతో దాడి  

క్లబ్ డాన్సర్ మీద దాడి చేసిన తోటి డాన్సర్. .

Bar Dancer Stripped And Beaten Up In Hyderabad-bar Girl,begampet,hyderabad,hyderabad Pubs

ఈ మధ్యకాలంలో యువత మరీ శృతి మించి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా కుర్రాళ్ళు డ్రగ్స్, మాదకద్రవ్యాలకు అలవాటు పడి ఆడవాళ్లు కనిపిస్తే వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందుతున్నారు. వారిని మానసికంగా, శారీరకంగా హింసించి పైశాచిక ప్రవర్తనలతో తమ వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకుంటున్నారు..

క్లబ్ డ్యాన్సర్ పై వికృత చేష్టలతో దాడి-Bar Dancer Stripped And Beaten Up In Hyderabad

తాజాగా హైదరాబాద్ లో నడి రోడ్డుపై దారుణ ఘటన చోటుచేసుకుంది. బేగంపేటలోని ఓ పబ్ లో శుక్రవారం రాత్రి ఓ డ్యాన్సర్ పై దాడి జరిగింది. క్లబ్ డ్యాన్సర్ గా ఉన్న యువతిని బ్లేడుతో కోసి పళ్లతో రక్కేసి ఓ వ్యక్తి రాక్షసానందం పొందడమే కాకుండా, ఆమె గాయాలతో బాధపడుతుంటే చీర లాగి రాక్షసానందం పొందాడు.

కాళ్లతో తంతు కింద పడేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకెళ్తే సినిమా ఛాన్సుల కోసం నగరానికి వచ్చిన ఓ యువతి బేగంపేటలోని డాన్సర్ గా చేరింది.

అక్కడకు వచ్చే మందుబాబులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటోంది. ఇదే సమయంలో వ్యభిచారం చేయాలని కూడా పబ్ నిర్వాహకులు ఆమెపై ఒత్తిడి తేవడం, ఓ రాత్రి కస్టమర్ తో గడిపితే 10 వేలు ఇస్తామని ఆశ చూపించారు ఇలాంటి పనులు తనకు ఇష్టం లేదని ఆమె చెప్పేసింది. ఈ క్రమంలో తన తోటి డ్యాన్సర్ సిద్ధూ తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు ఆమె ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకున్న సిద్దు పబ్ ముందు నడిరోడ్డుపై ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు జరిగిన ఘోరం గురించి చెప్పుకొచ్చింది.

తనకు న్యాయం చేయాలని వేడుకుంది.