ప్రెసిడెంట్ అయి రెండు రోజులు కూడా కాలేదు, అంతలోనే!  

Bar Council President Attacked By Opposite Person-telugu Viral News Updates

బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా భాద్యతలు స్వీకరించి రెండు రోజులు కూడా కాలేదు కోర్టు ప్రాంగణం లోనే ఆమె హత్యకు గురికావడం ఉత్తర ప్రదేశ్ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఉత్తర ప్రదేశ్ బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా రెండు రోజుల క్రితం దర్వేష్ సింగ్ అనే మహిళ ఎన్నికయ్యారు. దీనితో ఆమెకు కోర్టు ప్రాంగణం లోనే సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు..

ప్రెసిడెంట్ అయి రెండు రోజులు కూడా కాలేదు, అంతలోనే!-Bar Council President Attacked By Opposite Person

ఈ క్రమంలో ఆమె ఈ కార్యక్రమానికి హాజరు కాగా సడన్ గా మనీష్ శర్మ అనే ఒక న్యాయవాది ఆమె ని దారుణంగా హత్య చేశారు. బార్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా తొలిసారి ఒక మహిళ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో దర్వేష్ తొలిసారి ఆ హోదా లో సివిల్ కోర్టుకు వచ్చారు.

ఈ నేపథ్యంలో ఆమెకు సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమం సమయంలోనే దర్వేష్ పై మనీష్ శర్మ కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్సులు కూడా చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.

దర్వేష్ పై మనీష్ తన లైసెన్స్ గన్ తోనే కాల్పులు జరపడం తో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మనీష్ తనని తానూ కాల్చుకోవడం తో అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

అయితే వారిమధ్య చాలా కాలంగా వైరం ఉన్నట్లు ఈ క్రమంలోనే ఈ విధంగా కాల్పులు జరిపినట్లు అధికారులు భావిస్తున్నారు. కానీ పదవి లోకి వచ్చి రెండు రోజులు కూడా కాకుండానే ఆమె దారుణ హత్యకు గురికావడం అందులోనూ కోర్టు ప్రాంగణం లోనే ఈ హత్య జరగడం పై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.