బాపు గారి మనవరాలిని మనం రోజు టీవీలో చూస్తూనే ఉన్నాము.! ఆ ప్రముఖ యాంకర్ ఎవరో తెలుసా.?   Bapu's Granddaughter Telugu Anchor Gayathri Bhargavi     2018-10-31   09:24:45  IST  Sainath G

అందంగా ఉన్న అమ్మాయిని బాపుగారి బొమ్మతో పోల్చుతారు. ఎందుకంటే బాపు గారి బొమ్మ అంత అందంగా ఉంటూనే. తెలుగులో లెజెండరీ దర్శకుడు కార్టూనిస్ట్ బాపు గారు. ఆయన చిత్రంలో ఒక్కసారైనా నటించి బాపు బొమ్మగా మారాలనే హీరోయిన్లు ఉండరు మహిళలను ఎంతో గొప్పగా చూపిస్తూనే నిండు సంప్రదాయ సినిమాలలో హీరోయిన్ పాత్రలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరిస్తారు.

ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే…బాపు గారి మనవరాలిని మనం రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం. కానీ మనలో చాలామందికి ఆమె బాపు గారి మనవరాలు అని తెలియదు. ముఖ టీవీ నటి యాంకర్ మోడల్ టీవీ ప్రెజెంటర్ గా చేసిన గాయత్రి భార్గవి బాపు గారి గారాల ప‌ట్టిన‌ట‌. 1984 లో హైదరాబాదులో జన్మించిన గాయ‌త్రి లెజెండరీ దర్శకుడు బాపు మనవరాలు. కాగా ఇండస్ట్రీలో తనకి మంచి పరిచయాలు ఉన్నా కూడా ఏనాడు ఆయన ఈమె కోసం మాట సాయం కూడా చేయలేదట‌. ఆమె సొంత టాలెంట్ తో ఆమెని ఆమె నిరూపించుకోవాలని చెప్పేవారట బాపు.

Bapu's Granddaughter Telugu Anchor Gayathri Bhargavi-

జెమినీ లో వచ్చిన ఆట కావాలా పాట కావాలా అలాగే ఈటీవీలో అభిరుచి మా టీవీలో మా ఊరి వంట కార్యక్రమాల్ని హోస్ట్ గా చేస్తున్నప్పుడు తన కెరియర్ లో భాగంగా నాగార్జున మహేష్ బాబు పవన్ కళ్యాణ్ రవితేజ వంటి పెద్ద హీరోల ఇంటర్వ్యూలు చేసింది. అలాగే అవును, ఒక లైలా కోసం, వంటి చిత్రాల్లో నటించారు. ఈమె మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా… నేషనల్ జియోగ్రాఫిక్ అనిమల్ ప్లానెట్ వంటి చానల్స్ లో ప్రోగ్రాములకి డబ్బింగ్ చెబుతూ ఉంటుంది. య‌న్టీఆర్ కు గాయ‌త్రీ హార్డ్ కోర్ ఫ్యాన్.. యంగ్ టైగ‌ర్ కోసం స్వ‌యంగా త‌యారు చేసిన హ‌రిక్రుష్ణ చిత్రాన్ని గిఫ్ట్ గా ఇచ్చి త‌న అభిమానాన్ని చాటుకుంది.