వైద్య సిబ్బందికి సెల్యూట్: అమెరికాలో నీల వర్ణంలో మెరిసిన హిందూ దేవాలయాలు

కరోనా మహమ్మారి విలయతాండవంతో ప్రపంచం వణికిపోతోంది.ఇప్పటికే మూడోంతుల భూగోళాన్ని చుట్టేసిన కోవిడ్ 19 మిగిలిన ప్రాంతాన్ని కూడా కవర్ చేసేందుకు చాప కింద నీరులా విస్తరిస్తోంది.

 Coronavirus,baps Hindu Mandirs ,north America, Lit Blue, Honor Healthcare Heroe-TeluguStop.com

ఈ మహమ్మారి బారి నుంచి మానవాళిని కాపాడేందుకు వైద్యులు, పోలీస్, ఇతర మెడికల్ సిబ్బంది తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.ముఖ్యంగా డాక్టర్లైతే ఇళ్లకు కూడా వెళ్లకుండా ప్రాణాలను అడ్డుపెడుతున్నారు.

వీరికి అన్ని దేశ ప్రభుత్వాలు, ప్రజలు జేజేలు కొడుతున్నారు.భారతదేశంలో జనతా కర్ఫ్యూ రోజు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు సాయంత్రం ఐదు గంటలకు ఇళ్ల నుంచి బయటకి వచ్చి చప్పట్లు కొట్టారు.

ఈ క్రమంలో హిందూ ఆధ్యాత్మిక సంస్థ బీపీఎస్ స్వామి నారాయణ్ సంస్థ వైద్యులు ఇతర సిబ్బందికి సంఘీభావం తెలపాలని నిర్ణయించింది.దీనిలో భాగంగా ఉత్తర అమెరికాలోని చికాగో, హ్యూస్టన్, లాస్ ఏంజిల్స్, టొరంటో, న్యూజెర్సీ, రాబిన్స్‌విల్లేలోని హిందూ మందిరాలను నీల వర్ణపు కాంతులతో వెలగించి ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్న వారికి కృతజ్ఞతలు>/em> తెలియజేస్తోంది.

Telugu Coronavirus, Lit Blue, America-

ఈ సందర్భంగా బీఏపీఎస్ డైరెక్టర్ నీలకంత్ పటేల్ మాట్లాడుతూ.తమ సంస్థ తొలి నుంచి ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని గుర్తుచేశారు.హెల్త్ ఇన్సూరెన్స్ చేయని వారి కోసం ఫెస్టివల్స్, సెమినార్లు తదితర కార్యక్రమాలు చేపట్టి సమాజ సేవలో తమ వంతు పాత్ర పోషిస్తున్నామని ఆయన తెలిపారు.ప్రస్తుతం క్లిష్ట పరిస్ధితుల్లో తమను, సమాజాన్ని, దేశాన్ని కాపాడుతున్న వైద్య సిబ్బందికి వందనం చేయాలని నిర్ణయించామని నీలకంత్ పేర్కొన్నారు.

ఇప్పటికే బీఏపీఎస్ సంస్థ న్యూయార్క్, న్యూజెర్సీ, కెనడాలలో కొన్ని ఆసుపత్రులకు 18,000 ఎన్95 మాస్క్‌లను విరాళంగా అందించింది.కాగా కరోనా కారణంగా అమెరికాలో గడచిన 24 గంటల్లో 1,514 మంది ప్రాణాలు కోల్పోయారు.

దీంతో అగ్రరాజ్యంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 22,020కి చేరింది.వీరిలో ఒక్క న్యూయార్క్‌లోనే 9,385 మంది మరణించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube