హిందుగాళ్లు బొందుగాళ్లు అన్నందుకు కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయరా?  

Banoth Lakshmi Once Again Comments On Kcr-telagana Cm Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు గాను జగిత్యాల జిల్లాకు చెందిన బానావత్‌ లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేసి ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.బెయిల్‌పై విడుదల అయిన తర్వాత మరోసారి లక్ష్మీ ఒక వీడియోలో కేసీఆర్‌ గురించి మాట్లాడింది...

Banoth Lakshmi Once Again Comments On Kcr-telagana Cm Kcr-Banoth Lakshmi Once Again Comments On KCR-telagana Cm Kcr

నేను ఒక మహిళలను అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా పోలీసులు 6 గంటల పాటు నిర్భందించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

గతంలో కేసీఆర్‌ గారు హిందూ గాళ్లు బొందుగాళ్లు అంటూ ఇష్టానుసారంగా మాట్లాడాడు.ఆయన మాటలకు ఎవరు ఎందుకు కేసు పెట్టలేదు.పోలీసులు ఆయన్ను ఎందుకు అరెస్ట్‌ చేయరు అంటూ ప్రశ్నించింది.

Banoth Lakshmi Once Again Comments On Kcr-telagana Cm Kcr-Banoth Lakshmi Once Again Comments On KCR-telagana Cm Kcr

ఒక మహిళ రైతుగా తాను ఎంతగానో బాధ అనుభవించాను కనుక ఆ సమయంలోనే నేను అలా మాట్లాడాను.ఆమాత్రం అర్ధం చేసుకోలేరా అంటూ ప్రశ్నించింది.నన్ను అరెస్ట్‌ చేసి మొత్తం మహిళ రైతులను అవమాన పర్చారు అంటూ లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది.