చరణ్‌ బర్త్‌డేకు బన్నీ సందడి ఏంటి... అలా ప్లాన్‌ చేయడంకు కారణం ఏంటో?  

  • అల్లు అర్జున్‌ నా పేరు సూర్య చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని కమిట్‌ అయిన మూవీ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో జులాయి మరియు సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక వీరిద్దరి కాంబో మూవీ హ్యాట్రిక్‌ అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు మరియు మెగా ఫ్యాన్స్‌ చాలా నమ్మకంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎప్పుడెప్పుడా అంటూ వీరి మూవీ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు బన్నీ అండ్‌ టీం హ్యాపీ న్యూస్‌ను ప్రకటించడం జరిగింది.

  • Banny And Trivikram Movie Will Starts On Charan Birthday-Banny Banny Starting Date Ram Birth Day Srinivas

    Banny And Trivikram Movie Will Starts On Charan Birthday

  • ఈనెల 27న చిత్రంను పట్టాలెక్కించబోతున్నట్లుగా అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్‌ కూడా అరవింద సమేత చిత్రం పూర్తి చేసి చాలా రోజులు అయ్యింది. అప్పటి నుండి కూడా బన్నీకోసం స్క్రిప్ట్‌ వర్క్‌ చేసి చేసి ఉన్నాడు. ఎట్టకేలకు మూవీని ప్రారంభించేందుకు సిద్దం చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను కూడా ఎంపిక చేయడం జరిగింది. అంతా చకచక జరుగుతున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ తేదీని మార్చి 27 అంటూ నిర్ణయించడం ప్రస్తుతం అందరిలో ఆశ్చర్యంను కలిగిస్తుంది. ఆ రోజు రామ్‌ చరణ్‌ బర్త్‌డే అవ్వడమే ఆ ఆశ్చర్యంకు కారణం.

  • Banny And Trivikram Movie Will Starts On Charan Birthday-Banny Banny Starting Date Ram Birth Day Srinivas
  • అల్లు అర్జున్‌ ఎందుకు రామ్‌ చరణ్‌ బర్త్‌డే రోజున తన సినిమాను ప్రారంభించేందుకు సిద్దం అయ్యాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది. మెగా ఫ్యాన్స్‌లో కూడా ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రంను రామ్‌ చరణ్‌ ఆశీస్సులు తీసుకుని ప్రారంభిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆయన బర్త్‌డే రోజున ప్రారంభించాలని బన్నీ భావిస్తున్నాడని కొందరు మెగా ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం చరణ్‌కు కౌంటర్‌గానే ఆ రోజున బన్నీ సినిమాను ప్రారంభిస్తున్నాడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అసలు విషయం ఏంటో ఆ అల్లు అర్జున్‌కే తెలియాలి.