కడప జిల్లా ప్రొద్దుటూరులో ‘వై నాట్ బీసీ’ ( Why Not BC )పేరుతో వెలిసిన బ్యానర్లు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.ప్రొద్దుటూరు వైసీపీ( ycp ) టికెట్ బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బ్యానర్లు వెలిశాయి.
తమ ఉనికి చాటుకునేలా బీసీ సంఘాలు ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది.ఇందులో భాగంగా బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో.
ఈ నెల 18వ తేదీన ప్రొద్దుటూరులో బీసీ ఆత్మగౌరవ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రస్తుతం ప్రొద్దుటూరులో( Proddatur ) వై నాట్ బీసీ పేరుతో వెలిసిన ప్లెక్సీలు, బ్యానర్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.