బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ బ్యాంకులలో డిపాజిట్ చేస్తే 9 శాతం వడ్డీ.!

కరోనా వైరస్ కారణంగా.కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ, ఇంకోన్ని బ్యాంకులు మాత్రం చెప్పుకోదగ్గ వడ్డీలను చెల్లిస్తున్నాయి.

 Banks Offering 9% Interest On Fixed Deposits, Banks ,interest Rates, Fixed Depos-TeluguStop.com

ముఖ్యంగా ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన పెట్టుబడి.ప్రజలు తమ డబ్బును FDలో ఉంచడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

ఈక్విటీలో పెట్టుబడులు పెట్టడం కంటే FDలో పెట్టుబడి వీరు సురక్షితంగా భావిస్తారు.ఎందుకంటే, చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రూపంలో దాదాపుగా 7.5% నుండి 8.5% వరకు స్థిర డిపాజిట్లపై వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

ఇకపోతే RBI (రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా) రుణ గ్రహితులకు వడ్డీ భారం తగ్గిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసినదే.ఇటీవల బ్యాంకులు వాహన, గృహ రుణాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి.

ఈ క్రమంలో ఫిక్స్ డ్, సేవింగ్స్ ఖాతాలకు బ్యాంకులు చెల్లించే వడ్డీరేట్లు దారుణంగా పడిపోయాయి.కాకపోతే కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మాత్రం సాధారణ వినియోగదారులకు 8%, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీని అందించడం గమనార్హం.

Telugu Bank Offers, Banks, Banksinterest, Fixed Deposit, Fixed Deposits, Hdfc, I

SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), HDFC, ICICI, యాక్సిస్ బ్యాంక్స్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ తెరిచే అవకాశాన్ని కల్పిస్తున్నారు.ఇకపోతే లాక్ డౌన్ తరువాత వివిధ బ్యాంక్స్ డిపాజిట్లపైన 9% వరకు వడ్డీ రేట్లను పెంచడం కొసమెరుపు.ఈ క్రమంలో అనేక బ్యాంకులు 7% నుండి, 9% వడ్డీలను కల్పిస్తున్నాయి.

ఉదాహరణకు జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఇంకా మొదలైన బ్యాంకులు 9% వరకు వడ్డీని అందిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube