కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి బ్యాంకుల బంపర్‌ ఆఫర్‌!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రాణాంతకంగా మారుతోంది.ఈ వైరస్‌తో పోరాటం చేసి, మన ప్రాణాలను రక్షించుకోవడానికి ఇప్పటికే అన్ని దేశాలు టీకాలు ప్రారంభించాయి.

 Banks Offering High Rate Of Interest To Its Vaccine Took Customers-TeluguStop.com

అయితే, మన దేశీయ బ్యాంకులు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి బంపర్‌ ఆఫర్‌ ప్రకటిస్తూనే ఉన్నాయి.ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్‌ తీసుకుంటే వివిధ బహుమతులు ఇస్తామని ప్రకటిస్తూనే ఉన్నారు.

ఇప్పుడు మన బ్యాంకులు కూడా ఆ దారినే అనుసరిస్తున్నాయి.ఆ వివరాలు తెలుసుకుందాం.

 Banks Offering High Rate Of Interest To Its Vaccine Took Customers-కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి బ్యాంకుల బంపర్‌ ఆఫర్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా వ్యాక్సినేషన్‌ తీసుకున్న వారికోసం కొన్ని బ్యాంకులు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.అవి కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ రేటును వారి కోసం ప్రత్యేకంగా ప్రకటిస్తున్నాయి.

దీంతో వినియోగదారులకు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.కానీ, ఈ ఆఫర్‌ను లిమిటెడ్‌ పీరియడ్‌ వరకే ఉంది.

ఇప్పటికే శరవేగంగా విస్తురిస్తున్న కరోనా వైరస్‌తో అన్ని రంగాలు ఆర్థింగా దెబ్బతిన్నాయి.ప్రతి ఒక్కరూ ఎదో విధంగా కొవిడ్‌ వల్ల ప్రభావం పొందినవారే.ఇలాంటి సందర్భంలో వినియోగదారులకు బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లతో ఆకట్టుకుంటున్నారు.ఒకవైపు వారికి ప్రత్యేవ వడ్డీ రేట్లతో బంపర్‌ ఆఫర్లు ఇస్తూనే మరోవైపు కొవిడ్‌ టీకాకు ప్రోత్సహిస్తున్నాయి.

ముఖ్యంగా డబ్బులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకునే వారికి ఎక్కువ రాబడి వస్తుంది.

Telugu Bank Customers, Central Bank, Covid Vaccination, Fixed Deposits, Immune Deposit Scme, Over Fixed Diposits, Uco Bank-Latest News - Telugu

అందుకే చాలా మందికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ ఆఫర్‌ను ప్రకటిస్తున్న బ్యాంక్‌ యూకో బ్యాంక్‌.తమ వినియోగదారులకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎక్కువ శాతం వడ్డీ రేటును అందిస్తోంది.సాధారణ వినియోగదారు కంటే వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి దాదాపు 0.03 శాతం అధిక వడ్డీని ప్రకటించింది.ఈ ఆఫర్‌ కేవలం 999 రోజుల ఎఫ్‌డీకే వర్తిస్తుంది.

ఆఫర్‌ కూడా సెప్టెంబర్‌ చివరి వరకే అందుబాటులో ఉండనుంది.ఈ విధంగా ఆఫర్‌ను ప్రకటిస్తోన్న మరో బ్యాంక్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.ఈ బ్యాంక్‌ కూడా టీకా తీసుకున్న కస్టమర్లకు ఎక్కువ శాతం వడ్డీ ఆఫర్‌ చేస్తూ వారిని వ్యాక్సినేషన్‌కూ కూడా ప్రోత్సహిస్తోంది.ఇమ్యూన్‌ ఇండియా డిపాజిట్‌ స్కీమ్‌ పేరుతో వినియోగదారులకు కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంటే 0.25 శాతం ఎక్కువ వడ్డీని ప్రకటించింది. 1111 రోజుల ఎఫ్‌డీలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.ఇక బ్యాంకులన్ని వినియోగదారులను వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమానికి పూనుకున్నట్టు తెలుస్తోంది.

.

#Covid #ImmuneDeposit #UCO Bank #Central Bank #Fixed Deposits

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు